బుట్ట బొమ్మని మిస్ అవుతున్న ఫ్యాన్స్..?
బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ కి దూరమైంది. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో స్టార్ హీరోలు హీరోయిన్ గా మొదటి ఆప్షన్ గా పూజా హెగ్దేని ఎంపిక చేసుకునే వారు.
By: Ramesh Boddu | 20 Jan 2026 8:00 PM ISTబుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ కి దూరమైంది. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో స్టార్ హీరోలు హీరోయిన్ గా మొదటి ఆప్షన్ గా పూజా హెగ్దేని ఎంపిక చేసుకునే వారు. దర్శక నిర్మాతలు కూడా పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ పరంగా కలిసి వస్తుందని అనుకునే వారు. కానీ ఎప్పుడైతే రాధే శ్యాం పోయిందో అప్పటికే ఆమె గ్రాఫ్ పడిపోతూ రాగా ఆ తర్వాత గుంటూరు కారం సినిమా నుంచి ఆమె ఎగ్జిట్ అవ్వడం టాలీవుడ్ ని మరింత దూరం చేసుకుంది.
రేసులోకి కొత్త హీరోయిన్స్..
గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్దే చేస్తే ఎలా ఉండేదో కానీ ఆమె చేయాల్సిన రోల్ ని శ్రీలీల చేసింది. ఐతే తెలుగు ఆడియన్స్ బుట్ట బొమని బాగా మిస్ అవుతున్నారు. అఫ్కోర్స్ రేసులోకి కొత్త హీరోయిన్స్ వచ్చారు. ఆల్రెడీ రష్మిక సూపర్ ఫాం కొనసాగిస్తుంది. శ్రీలీల, భాగ్య శ్రీ ఇలా కొత్త హీరోయిన్స్ తమ టాలెంట్ చూపిస్తున్నారు. అయినా కూడా పూజా హెగ్దేకి ఛాన్స్ ఇవ్వాల్సిందే అన్నది తెలుగు ఆడియన్స్ కామెంట్.
తెలుగు సినిమాలతోనే బాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకుంది పూజా హెగ్దే. హిందీలో ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. ఎప్పుడైతే టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకుందో అప్పుడు హిందీలో కూడా అలాంటి అవకాశాలే వచ్చాయి. టాలీవుడ్ కాదు కానీ కోలీవుడ్ లో పూజా హెగ్దేకి అవకాశాలు వస్తున్నాయి. సూర్యతో రెట్రో చేసిన ఈ బ్యూటీ జన నాయగన్ లో నటించింది.
దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ సినిమాలో..
లారెన్స్ చేస్తున్న కాంచన 4లో కూడా పూజా హెగ్దే ఛాన్స్ అందుకుంది. ఐతే తమిళ, హిందీ సినిమాలు ఓకే కానీ పూజా బేబ్ టాలీవుడ్ ఛాన్స్ ల కోసం ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ సినిమాలో అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకుంది. రవి అనే నూతన డైరెక్టర్ చేస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్.
అవకాశాలు రాకపోయినా డిమాండ్ విషయంలో పూజా హెగ్దే ఎక్కడ తగ్గట్లేదు. మరి దుల్కర్ సినిమాతో పాటు తెలుగులో మరికొన్ని ఛాన్స్ లు ఏవైనా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. పూజా బేబ్ గ్లామర్ షో కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. తెలుగు మేకర్స్ ఆమెకు మరో అవకాశాన్ని ఇవ్వాలని వాళ్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ తో టాలీవుడ్ ఛాన్స్ అందుకున్న పూజా హెగ్దే మళ్లీ ఇక్కడ హిట్ ఫాం కొనసాగిస్తుందేమో చూడాలి. బాలీవుడ్ కన్నా సౌత్ సినిమాల మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్న పూజా హెగ్దేకి మళ్లీ తన స్టార్ ఫాం రోజులు తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
