గ్లామర్ లుక్ లో సెగలుగొట్టిస్తున్న పూజా హెగ్డే.. లేటెస్ట్ లుక్ వైరల్!
ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న పూజా హెగ్డే మొదటి సినిమాతోనే అందం ,అభినయంతో, నటనతో కట్టిపడేసింది.
By: Madhu Reddy | 4 Jun 2026 7:53 PM ISTఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న పూజా హెగ్డే మొదటి సినిమాతోనే అందం ,అభినయంతో, నటనతో కట్టిపడేసింది. ఈ సినిమా కంటే ముందే 2012లో మూగమూడి అనే తమిళ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. 2014లో ముకుందా సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గాపేరు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో జిగేలురాణి అంటూ హొయలు పోతూ కుర్రకారు మతులు పోగొట్టింది.
అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దల కొండ గణేష్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే.. అలవైకుంఠపురంలో బుట్ట బొమ్మగా అమూల్య పాత్రతో మరింత ఇమేజ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఈమె చేసిన మరే సినిమా కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , రాధే శ్యామ్, ఆచార్య, ఎఫ్ 3 ఇలా ప్రతి సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో మళ్లీ మరో తెలుగు సినిమాలో అవకాశం లభించలేదు. అయితే అటు తమిళ్లో దేవా, రెట్రో వంటి సినిమాలు చేసింది కానీ ఇవి కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. కానీ రజనీకాంత్ కూలీ సినిమాలో మోనిక అనే స్పెషల్ సాంగ్ చేసి మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే విజయ్ దళపతి చివరి సినిమాగా జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా సెన్సార్ సమస్య వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు.
ప్రస్తుతం హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటించింది. ఈ సినిమా జూన్ 5న అనగా రేపు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది . వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ , పూజా హెగ్డే కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించగా.. రమేష్ తౌరాణి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకవైపు హీరోయిన్స్ తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పూజా హెగ్డే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని అదిరిపోయే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తాజాగా లైట్ ఆరెంజ్ కలర్ ఆర్గాన్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఫ్రాక్ ధరించిన ఈమె తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ లుక్ ను పర్ఫెక్ట్ గా మార్చుకోవడానికి వైట్ కలర్ పాయింట్ హీల్ ధరించి తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది .ఇక టాప్ అందాలను హైలెట్ చేస్తూ గ్లామర్ వలకబోస్తూ పూజ హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే పూజా హెగ్డే ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఒక స్పెషల్ కొటేషన్ కూడా పంచుకుంది.
"తన ఆత్మతో సన్నిహితంగా మెలిగే ఒక స్త్రీ ప్రవహించే నది లాంటిది .ఆమె ఎప్పుడూ కూడా కపటం లేకుండా తాను కోరుకున్న గమ్యానికి మాత్రమే వెళుతుంది. తనలా తానుగా.. కేవలం తానుగా మాత్రమే ఉండేందుకు సిద్ధపడి తన గమ్యాన్ని చేరుకుంటుంది" అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికైతే పూజా హెగ్డే షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు పంచుకున్న భావాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
