Begin typing your search above and press return to search.

దుల్కర్ తో రొమాన్స్.. ఈసారి పూజ హిట్ కొట్టేస్తుందా?

దుల్కర్, పూజ లీడ్ రోల్స్ లో నటిస్తున్న DQ 41 ప్రాజెక్టును రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు.

By:  M Prashanth   |   11 Sept 2025 12:05 PM IST
దుల్కర్ తో రొమాన్స్.. ఈసారి పూజ హిట్ కొట్టేస్తుందా?
X

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి లాంగ్ గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని ఏలిన అమ్మడు.. ఇప్పుడు అసలు సందడి చేయడం లేదు. తమిళ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నా.. తెలుగులో మాత్రం ఆమెకు అనుకున్నంత స్థాయిలో ఛాన్స్ లు దక్కడం లేదు.

ఒకవేళ వచ్చినా.. ఏదో ఒక విధంగా మిస్ అవుతున్నాయి. దీంతో మంచి అవకాశాలు ఎదురుచూస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు అదిరిపోయే ఛాన్స్ కొట్టేశారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఓ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా.. పొడుగు కాళ్ళ సుందరి ఆయనకు జోడీగా నటిస్తోంది.

దుల్కర్, పూజ లీడ్ రోల్స్ లో నటిస్తున్న DQ 41 ప్రాజెక్టును రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే షూటింగ్ మొదలవ్వగా.. సైలెంట్ గా కానిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు అధికారికంగా పూజ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

పూజకు వెల్కమ్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది మేకింగ్ వీడియో కాగా.. అందులో పూజా స్కూటీ నడుపుతున్నారు. వెనుక దుల్కర్ కూర్చుని ఉన్నారు. ఆహ్లాదకర వాతావరణంతో వీడియో ఉండగా.. హీరో హీరోయిన్ల మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా కనిపిస్తోంది. మేకర్స్ కూడా అదే విషయాన్ని చెప్పారు. అయితే ఈ మూవీతో టాలీవుడ్ లో పూజా హెగ్డే మంచి కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తుందని సినీ ప్రియులు, నెటిజన్లు అంచనా వేస్తున్నారు. సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.

అయితే మాలీవుడ్ హీరో అయినా.. దుల్కర్ టాలీవుడ్ ఒరిజినల్ హీరోలా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అదే వరుసలో సూపర్ హిట్స్ కూడా అందుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు పూజా హెగ్డేతో కలిసి యాక్ట్ చేస్తున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో.. అమ్మడికి ఎలాంటి హిట్ తెచ్చి పెడుతుందో వేచి చూడాలి.