డెనిమ్ అవుట్ ఫిట్ లో బుట్టబొమ్మ అందాలు!
అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా గ్లామర్ వలకబోస్తూ అందచందాలతో సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నారు సెలబ్రిటీలు.
By: Madhu Reddy | 29 May 2026 10:20 AM ISTఅవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా గ్లామర్ వలకబోస్తూ అందచందాలతో సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నారు సెలబ్రిటీలు. మరి కొంతమంది వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తమ సినిమా షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నా అభిమానులను అలరించడానికి నిత్యం రకరకాల ఫోటోషూట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అలాంటి వారిలో బుట్టబొమ్మ అలియాస్ పూజా హెగ్డే కూడా ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో అనే చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించి బుట్ట బొమ్మగా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు తెలుగులో తన అందచందాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న పూజా హెగ్డే ఆచార్య, ఎఫ్ 3 చిత్రాల తర్వాత మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకోలేదు. కానీ బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె తాజాగా హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటించింది.
వరుణ్ ధావన్, మృణాల్ ఠాగూర్, పూజా హెగ్డే కలయికలో వస్తున్న ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రమేష్ తౌరాణి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అటు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు హీరోయిన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇలా గ్లామర్ ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలా బుట్ట బొమ్మ కూడా తాజా లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
డెనిమ్ టాప్ అండ్ బాటమ్ ధరించి జుట్టును వదిలేసి.. గోళ్లు కొరుకుతూ స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మరికొన్ని ఫోటోలలో ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నట్టు వాటిని పంచుకుంది. భిన్న భిన్నమైన ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది పూజా హెగ్డే. మొత్తానికైతే ఇలా డెనిమ్ అవుట్ ఫిట్ లో అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
పూజా హెగ్డే ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. తమిళ్లో చివరిగా కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందర్నీ ఆకట్టుకున్న ఈమె.. విజయ్ దళపతి జననాయగన్ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. అలాగే తమిళంలో కాంచన4లో కూడా నటిస్తున్న ఈమె.. తెలుగులో డి క్యూ41 సినిమాలో నటిస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ అవకాశాలు అందుకుంటూ మళ్లీ బిజీగా మారింది పూజా హెగ్డే. మరి ఈ సినిమాలతో పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని అభిమానులు కూడా ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
