ఎట్టకేలకు బుట్టబొమ్మ షురూ చేసింది!
ముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 4 Jan 2026 2:50 PM ISTముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అవకాశాల్ని కాదని వెళ్లిన అమ్మడు తిరిగి కోలీవుడ్ కి వచ్చి మళ్లీ తెలుగు ప్రయత్నాలు మొదలు పెట్టినా? ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. అప్పటి నుంచి తమిళ సినిమాలతోనే కాలం గడుపుతోంది. గత ఏడాది `దేవా`, `రెట్రో`, `కూలీ` సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా ఏ సినిమా సక్సెస్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రయత్నాలు చేసింది కానీ పలించలేదు. కానీ ఎట్టకేలకు ఓ హీరో, డైరెక్టర్ కరుణించాడు. దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న 41వ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.
ఈ సినిమాతో రవి నేలకుదిటి అనే కొత్త కుర్రాడు డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ ఛాన్స్ కూడా ఎన్నో ప్రయత్నాల తర్వాత వచ్చింది. అయితే ఛాన్స్ ఇచ్చింది తెలుగు నటుడు కాదు. దుల్కార్ సల్మాన్ మలయాళం హీరో. తెలుగులో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు. ఈ సినిమా కి పని చేస్తోన్న దర్శకుడు కూడా కొత్త వాడు. ఈ నేపథ్యంలో పూజాహెగ్డేకి ఛాన్స్ వచ్చింది. పూజా హెగ్డే మరో తెలుగు సినిమా చేస్తుందని కూడా పెద్దగా ప్రచారం జరగలేదు. మరి నాలుగేళ్ల తర్వాత నటిస్తోన్న ఈ సినిమా పూజాహెగ్డే కెరీర్ కి ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి.
అమ్మడు ఇప్పటికే మహేష్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పని చేసింది. వాళ్లతో మళ్లీ ఛాన్సులు అన్నవి అంత సులభం కాదు. వాళ్లంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. దీంతో హీరోయిన్ల ఎంపిక విషయంలో దర్శకులు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటినే తీసుకుంటున్నారు. కానీ పూజాహెగ్డే బాలీవుడ్ కెరీర్ కూడా ఏమంత గొప్పగా సాగలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా అవేవి కెరీర్ పరంగా కలిసి రాలేదు. నిజంగా అంత సక్సెస అందుకుంటే తిరిగి సౌత్ సినిమాలకు ఎందుకొస్తుంది? మరి ఇలాంటి ఫేజ్ లో కంబ్యాక్ అవుతోన్న బ్యూటీని కొత్త అవకాశాలతో ఎంత మంది ప్రోత్సహిస్తారో చూడాలి.
ఈ సంక్రాంతి కానుకగా తమిళ్ లో నటించిన జననాయగన్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇందులో దళపతి విజయ్ కి ఓడీగా నటించింది. సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే కోలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలున్నాయి. తమిళ్ లోనే హారర్ థ్రిల్లర్ `కాంచన 4` లోనూ నటిస్తోంది. ఇందులో అమ్మడు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అన్నది క్లారిటీ రావాలి. అలాగే హై జవానీతో ఇష్క్ హోనా హై అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ బుట్టబొమ్మకు ఎలాంటి కెరీర్ ని నిర్దేశిస్తాయి? అన్నది చూడాలి.
