Begin typing your search above and press return to search.

దుల్కర్ సినిమాలో పూజా హెగ్డే.. వాళ్లలా కలిసొస్తుందా?

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను తెలుగు సినిమా చేయక మూడేళ్లు దాటింది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

By:  M Prashanth   |   10 Sept 2025 9:21 PM IST
దుల్కర్ సినిమాలో పూజా హెగ్డే.. వాళ్లలా కలిసొస్తుందా?
X

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను తెలుగు సినిమా చేయక మూడేళ్లు దాటింది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. కానీ ఆమె ఇప్పుడు స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. పూజా హీరోయిన్ గాఎంపికైనట్లు సోషల్ మీడియాలో మేకర్స్ వీడియో షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడినట్లే. మళ్లీ తెలుగు ఆడియెన్స్ ను ఆమె పలకరించనుంది.

అయితే పూజా తెలుగు సినిమాలతోనే గుర్తింపు పొందింది. ఈ సినిమాలతోనే ఆమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఒక లైలా కోసం, ముకుంద చిత్రాలలో నటించినప్పటికీ.. ఆ సినిమాలతో ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేవు. కానీ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం, మహర్షి, అరవింద సమేత వీర రాఘవ రెడ్డి సినిమాల విజయం ఆమెను స్టార్ హీరోయిన్‌ గా నిలబెట్టాయి. ఇక కరోనా కంటే ముందు అలా వైకుంఠపురంతో,ఆమె టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కానీ ఆ తర్వాత కెరీర్ అనుకున్నట్లు సాగలేదు.

అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రభాస్ రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఫ్లాప్‌ లుగా ముగిశాయి. దీంతో ఆమె కొంతకాలం బాలీవుడ్‌ కు షిప్ట్ అయ్యింది. కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో నటించింది. కానీ అదీనూ ప్రేక్షకులను నిరాశపరిచింది. సర్కస్, దేవా కూడా ఆమె కెరీర్‌ ను పునరుద్ధరించలేకపోయారు. రెట్రో సినిమాతో ఆమె సౌత్ లోకి పునరాగమనం అని భావించినా.. అది ప్రతికూల ఫలితంతో ముగిసింది.

ఇక రీసెంట్ గా కూలీలో మోనికా పాట ఆమెను తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చింది. ప్రస్తుతం జన నాయగన్ ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగుతోంది. ఈ సమయంలో, దుల్కర్ సల్మాన్‌ తో సినిమా తీయడం ఆమెకు కలిసొచ్చే అంశంలాగా కనిపిస్తోంది. ఎందుకంటే.. దుల్కర్ చాలా మంది హీరోయిన్లకు లక్కీ ఛార్మ్. ఆయనతో కలిసి పనిచేసిన మృణాల్ ఠాకూర్ (సీతారామం), మీనాక్షి చౌదరి (లక్కీ భాస్క) తెలుగు హిట్ సినిమాలుగా నిలిచాయి. అయితే పూజ ఇప్పటికే ఇక్కడ సెటిల్ అయిన హీరోయిన్.. కాబట్టి ఇది కమ్ బ్యాక్ లాగా ఉపయోగపడవచ్చు

ఇక తాజాగా విడుదలైన DQ41 ప్రాజెక్ట్ గ్లింప్స్ పరిశీలిస్తే, పూజ సింపుల్ లుక్స్‌ తో పక్కింటి అమ్మాయిగా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు రవి నేలకుడిటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని SLV సినిమాస్ నిర్మించింది.

ఈ సినిమాతో పూజా విజయం సాధిస్తుందని, జనవరిలో జన నాయగన్ హిట్ అయితే, అది ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుందని ఆశిస్తున్నాను.