Begin typing your search above and press return to search.

సీఎం గారికి త్రిష త‌ర్వాత బుట్ట‌బొమ్మే క్లోజ్!

ముఖ్యంగా విజయ్‌తో సుదీర్ఘ కాలంగా స్నేహాన్ని కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు ఈ జాబితాలో ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది.

By:  Srikanth Kontham   |   24 Jun 2026 9:00 PM IST
సీఎం గారికి త్రిష త‌ర్వాత బుట్ట‌బొమ్మే క్లోజ్!
X

తమిళ చిత్రసీమలో తిరుగులేని మాస్ హీరోగా దశాబ్దాల పాటు అలరించిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో ముఖ్యమంత్రి గా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. గ్లామర్ ప్రపంచం నుండి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టినప్పటికీ ఆయన సినీ ప్రస్థానంలో ఏర్పడిన కొన్ని అత్యంత సన్నిహితమైన స్నేహబంధాలు ఇప్పటికీ పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చలకు దారితీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విజయ్‌తో సుదీర్ఘ కాలంగా స్నేహాన్ని కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు ఈ జాబితాలో ఎప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది.

విజయ్- త్రిషల కాంబినేషన్ వెండితెరపై ఒక క్లాసిక్ మ్యాజిక్. `గిల్లి`, `తిరుపాచ్చి` వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట స్క్రీన్ పైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ స్నేహాన్ని కాపాడుకుంటూ వస్తోంది. విజయ్ జీవితంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నా? ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయాల వెనుకనైనా? త్రిష ఇచ్చే నైతిక మద్దతు ఎంతో కీలకమైనదని ఇండస్ట్రీ టాక్. విజయ్‌కి అత్యంత ఆప్తురాలిగా,నిజమైన స్నేహితురాలిగా త్రిషకు ప్ర‌త్యేక స్థానం ఉంది .

త్రిష తర్వాత విజయ్ అంతటి ప్రాధాన్యతను, సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్న మరో నటి బుట్టబొమ్మ పూజా హెగ్డే అని తెలిసింది. ఇద్ద‌రి కలయికలో వచ్చిన `బీస్ట్` సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే ఇద్ద‌రి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. పూజా హెగ్డే సరదా స్వభావం, ప్రొఫెషనల్ అప్రోచ్ విజయ్‌కి ఎంతగానో నచ్చాయని అప్పటి నుండి ఆమె దళపతికి మంచి స్నేహితురాలిగా మారిందని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. విజయ్ లాంటి సీనియర్ స్టార్‌తో పూజా మెలిగే తీరు, వారి మధ్య ఉన్న పరస్పర గౌరవం అప్పుడ‌ప్పుడు చ‌ర్చ‌కొస్తుంది.

విజయ్ చివరి చిత్రం దళపతి 69 ప్రాజెక్టులో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక కావడం వెనుక ఈ స్నేహబంధమే ప్రధాన కారణమనే ప్రచారం సాగుతోంది. పూజా హెగ్డే నటిస్తే బాగుంటుందని విజ‌య్ స్వయంగా భావించినట్లు టాక్. ఆ కార‌ణంగానే `జ‌న నాయ‌గ‌న్` లో హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అవ‌కాశాలు రాని స‌మ‌యంలో...టాలీవుడ్ ప‌క్క‌న‌బెట్టి త‌రుణంలో విజ‌య్ రికమండీష‌న్ తోనే బుట్ట‌బొమ్మ కోలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుంద‌నే వార్త ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

మొత్తంగా త్రిష త‌ర్వాత పూజాహెగ్డే మంచి స్నేహితురాలిగా కొన‌సాగుతుందన్న‌ది క్లియ‌ర్. ఇక త్రిష‌..పూజా హెగ్డే సినిమాల సంగ‌తి చూస్తే? త్రిష సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు జోడీగా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుం టుంది. భాష‌తో సంబంధం లేకుండా ఏ సీనియర్ స్టార్ అయినా ఒకే అంటూ ముందుకెళ్తుంది. పూజాహెగ్డే మాత్రం త‌మిళ్ లోనే కొన‌సాగుతుంది. ఇటీవ‌లే ఓ తెలుగు సినిమాలో ఛాన్స్ అందుకుంది. కాక‌పోతే అందులో న‌టించేది మ‌ల‌యాళం హీరో కావ‌డంతో పూజ కు పెద్ద‌గా మైలేజ్ రావ‌డం లేదు.