సెల్ఫీ ఫోజులతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసిన బుట్ట బొమ్మ!
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
By: Madhu Reddy | 1 Dec 2025 10:30 AM ISTడిసెంబర్ నెల మొదలైందంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది క్రిస్మస్.. చిన్నపిల్లలను మొదలుకొని పెద్దల వరకూ.. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకూ..ప్రతి ఒక్కరు అత్యంత ఘనంగా జరుపుకునే వేడుక ఇది. ఒకప్పుడు కేవలం పాశ్చాత్య దేశాలలో మాత్రమే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఊరువాడ మతం భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని పండుగలను కలగలిపి జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే క్రిస్మస్ పండుగను కూడా ప్రతి ఒక్కరు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ నెల ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసింది బుట్టబొమ్మ పూజా హెగ్డే.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు క్రిస్మస్ ట్రీ దగ్గర స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ సెల్ఫీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.టీ షర్ట్ ప్యాంట్ ధరించి అందంగా ఫోజులు ఇచ్చిన ఈమె.. మరొక ఫోటోలో బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి అందులో తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అసలైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ షురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
పూజ హెగ్డే కెరియర్ విషయానికి వస్తే.. నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమెకు.. అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురంలో సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మగా మరింత పాపులారిటీ అందుకుంది పూజ హెగ్డే.
ఇకపోతే ఏమైందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో కథలు ఎంపిక విషయంలో కాస్త తడబాటు పడుతున్న ఈమెకు సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. అవకాశాలు వస్తున్నా.. సక్సెస్ లేకపోవడంతో ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. రజినీకాంత్ కూలీ సినిమాలో "మోనిక" అనే స్పెషల్ సాంగ్ చేసినందుకు ఏకంగా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈమె.. రెట్రో సినిమాకు 3.5 కోట్లు తీసుకుంది. విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాకు ఏకంగా 6 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈమె.. ఇప్పుడు రాబోతున్న హిందీ సినిమా దేవా కోసం కేవలం 3 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అవకాశాలు తగ్గుముఖం పట్టడం. ఒకవేళ అవకాశాలు వచ్చినా సక్సెస్ లేకపోవడంతోనే రెమ్యూనరేషన్ ని పూజ హెగ్డే తగ్గించుకున్నట్లు సమాచారం.
