ఎయిర్‌పోర్ట్‌కి పూజా హెగ్డే పడవ ప్రయాణం
తాజాగా చెన్నైలో ఉన్న వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితిని పూజా హెగ్డే ఒక వీడియో రూపంలో తన ఫాలోవర్స్ కి చూపించింది.
By: Ramesh Palla | 19 Sept 2025 4:06 PM ISTప్రభాస్‌తో కలిసి నటించిన 'రాధేశ్యామ్' సినిమా తర్వాత పూజా హెగ్డే టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించలేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా అవి గెస్ట్ రోల్, ఐటెం సాంగ్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ అమ్మడిని మెల్ల మెల్లగా మరిచి పోతున్నారు. అయితే లక్కీగా ఈ అమ్మడికి ఇతర భాషల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తమిళ్, తెలుగులో వరుస సినిమాలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. పూజా హెగ్డే సినిమాలు చేసినా చేయకున్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు ఉన్న దాదాపు 28 మిలియన్‌ల ఫాలోవర్స్ కోసం రెగ్యులర్‌గా ఏదో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా చెన్నైలో ఉన్న వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితిని పూజా హెగ్డే ఒక వీడియో రూపంలో తన ఫాలోవర్స్ కి చూపించింది.
ఎయిర్ పోర్ట్‌కి పూజా హెగ్డే ప్రయాణం
ఆ వీడియోలో పూజా హెగ్డే కారులో ప్రయాణిస్తూ ఉంది. కారు వెనుక సీటులో కూర్చుని విండో నుంచి పూజా వీడియో రికార్డ్ చేసింది. వీడియో రోడ్డు పై పెద్ద ఎత్తున నీరు చేరింది. రోడ్డు పై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వరద కారణంగా చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ వరదలో కార్లు, బైక్‌లపై ప్రయాణం కంటే చిన్నపాటి బోట్ లో ప్రయాణం చేయడం ఉత్తమం అనిపించేలా ఉంది. అందుకే ఈ వీడియోపై పూజా హెగ్డే.. ఎయిర్ పోర్ట్‌కి చిన్నపాటి బోట్ రైడ్ అంటూ కామెంట్ పెట్టింది. అంతే కాకుండా ఈమధ్య కాలంలో విమానాశ్రయంలో నాకు ఈ మధ్య ఇలాంటివి చాలానే అవుతున్నాయి అన్నట్లుగా కామెంట్ పెట్టింది. మొత్తానికి ఎయిర్ పోర్ట్‌కు వెళ్తున్న మార్గంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందిని ఫన్నీగా పూజా హెగ్డే ఇలా వీడియో రూపంలో తన అభిమానులతో షేర్ చేసుకుంది.
పూజా హెగ్డే సోషల్ మీడియా పోస్ట్ వైరల్
పూజా హెగ్డే సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు మాత్రమే షేర్ చేస్తుంది అనుకున్న వారికి ఇది సరికొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి సోషల్ మెసేజ్‌లు, విభిన్నమైన పోస్ట్‌లను పూజా హెగ్డే అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె డైలీ లైఫ్ కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో సినిమాలతో కాస్త స్లో అయింది. గతంతో పోల్చితే వరుస సినిమాలు చేయడం లేదు. చేస్తున్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు కావడం లేదంటే ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడం వంటివి జరుగుతుంది. అందుకే పూజా హెగ్డే కెరీర్ మళ్లీ పుంజుకుంటుందో లేదో అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రం ఖచ్చితంగా సినిమాల్లో మళ్లీ పూజా హెగ్డే తన అందంతో అదరగొట్టడం ఖాయం అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
కాంచన 4 లో నటిస్తున్న పూజా
1990లో ముంబైలో జన్మించిన పూజా హెగ్డే ఒకానొక సమయంలో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో నిలిచింది. కాల క్రమేనా ఈ అమ్మడు ఆఫర్లు రావడమే గొప్ప విషయం అన్నట్లుగా మారింది. ముందు ముందు ఈమె సినిమాలను మరింత తక్కువ పారితోషికంకు చేసినా ఆశ్చర్యం లేదు. ఆకట్టుకునే అందం ఉన్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. టాలీవుడ్‌లో రీ ఎంట్రీ కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ అమ్మడు మళ్లీ సినిమాలతో ఫుల్ స్వింగ్ తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాంచన 4 తో పాటు పలు సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. వాటిల్లో రెండు మూడు మంచి విజయాలను సొంతం చేసుకుంటే ఖచ్చితంగా మళ్లీ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కవచ్చు అంటున్నారు.
