దివాళీ వైబ్స్.. దీపాల వెలుగుల్లో మరింత అందంగా బుట్టబొమ్మ!
ఈ పార్టీలో రెడ్ కలర్ డ్రెస్ లో పూజా హెగ్డే అందాలు ఆరబోసింది. స్లీవ్ లెస్ డ్రెస్ తో పార్టీలో ఉన్న అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
By: Madhu Reddy | 17 Oct 2025 6:00 PM ISTమేడం సార్ మేడమ్ అంతే అని పూజా హెగ్డేను ఇందుకే అంటారు కావచ్చు.. తాజాగా పూజా హెగ్డేకి సంబంధించి హాట్ ఫొటోస్ వైరలవుతున్నాయి. పూజా హెగ్డే తాజాగా దివాళి సందర్భంగా బాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్ రమేష్ తౌరాణి ఇచ్చిన దివాలీ పార్టీలో మెరిసింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రమేష్ తౌరాణి దీవాలీ పార్టీ కోసం ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. అలా ఈ పార్టీకి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు. అందులో భాగంగానే ఈ పార్టీకి పూజా హెగ్డే కూడా వెళ్ళింది. ఈ పార్టీలో రెడ్ కలర్ డ్రెస్ లో పూజా హెగ్డే అందాలు ఆరబోసింది. స్లీవ్ లెస్ డ్రెస్ తో పార్టీలో ఉన్న అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
అయితే ఈ ఫోటోలను పూజా హెగ్డే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది. అంతేకాదు దీపావళి మొత్తం ఇక్కడే ఉంది అన్నట్లుగా "దివాళి ఇస్ హియర్" అని క్యాప్షన్ ఇచ్చింది. పూజా హెగ్డే ని ఈ డ్రెస్ లో చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ ఈ ఫోటోలు చూసినా అభిమానులు మైమరచిపోతున్నారు.చాలామంది ఈ ఫోటోలు చూసి రెడ్ మిర్చిలా హాట్ హాట్ గా ఉన్నావు.. గార్జియస్ అద్భుతంగా ఉన్నావు..రెడ్ డ్రెస్ లో నిన్ను చూస్తుంటే మా మతిపోతుంది అంటూ చాలామంది ఫైర్ ఎమోజిస్ తో కామెంట్లు పెడుతున్నారు. ఈ రెడ్ కలర్ డ్రెస్ లో పూజా హెగ్డే ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయ్యింది..
రెడ్ డ్రెస్ లో బుట్ట బొమ్మలా కనిపిస్తున్న పూజ హెగ్డే ని అలా చూస్తూ ఉండిపోతున్నారు ఫాలోవర్స్. అంతేకాకుండా తన రొమాంటిక్ లుక్ తో స్మైలింగ్ ఫేస్ తో చూసే వాళ్లందర్నీ తన చూపుతోనే కట్టిపడేస్తుంది. ఈ డ్రెస్సు లో పూజ హెగ్డే ఫ్యాషన్ తో పాటు ట్రెడిషన్ ని కూడా ఎంత ఫాలో అవుతుందో అర్ధం చేసుకోవచ్చు.గ్లామర్ గా కనిపించడంతోపాటు ట్రెడిషన్ ని ఫాలో అవుతూ పూజ హెగ్డే వేసుకున్న డ్రెస్సు పై చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అలా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే పూజ హెగ్డే తాజా స్టైలిష్ ఫోటోలకి మాత్రం చాలా మంది అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
ఇక గత కొద్ది రోజులుగా చూసుకుంటే పూజ హెగ్డే కెరియర్ కాస్త డౌన్ ఫాల్ అయింది అని చెప్పుకోవచ్చు. వరుస ఫ్లాపుల వల్ల ఆమె కెరియర్ కాస్త ఇరుకున పడింది. ఈ హీరోయిన్ ఈ మధ్యనే రజినీకాంత్ కూలీ మూవీలో మోనికా అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ఇంటర్నెట్ లో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. కూలీ మూవీతో మళ్లీ సినిమాలలో బిజీ అయిపోయిన పూజ హెగ్డే చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అలా దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న లవ్ స్టోరీ మూవీతో పాటు రాఘవ లారెన్స్ కాంచన 4 లో కూడా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే మూవీలో కూడా చేస్తుంది..
