Begin typing your search above and press return to search.

స్టైలిష్ లుక్ లో బుట్టబొమ్మ ఫోజులు..

ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లలో బుట్ట బొమ్మ అలియాస్ పూజా హెగ్డే కూడా ఒకరు.

By:  Madhu Reddy   |   31 Dec 2025 12:45 AM IST
స్టైలిష్ లుక్ లో బుట్టబొమ్మ ఫోజులు..
X

ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లలో బుట్ట బొమ్మ అలియాస్ పూజా హెగ్డే కూడా ఒకరు. ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలో ఘనంగా నిర్వహించగా.. అందులో తన వస్త్రధారణతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పూజా హెగ్డే. ఇప్పుడు మరోసారి మరో స్పెషల్ గెటప్ లో ఫోటోలను షేర్ చేసింది.




బ్లాక్ అవుట్ ఫిట్ లో మైదానంలో స్టన్నింగ్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది పూజా హెగ్డే. స్టైలిష్ గా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని సూర్యుడు ప్రతాపానికి తట్టుకోలేక ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు ఇంకొన్ని ఫోటోలలో తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈమధ్య హీరోయిన్స్ ఇలా తమ అందాలతో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటున్నారని చెప్పవచ్చు.




1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించిన ఈమె మహారాష్ట్రలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో పెరిగానని తెలిపింది. ఈమె తండ్రి మంజునాథ్ క్రిమినల్ లాయర్.. తల్లి లతా హెగ్డే ఇమ్యునాలజిస్ట్ అలాగే వ్యవస్థాపకురాలు కూడా. కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఈమె అన్నయ్య రిషబ్ హెగ్డే ఆర్థోపెడిక్ సర్జన్. ఈమె తుళుతోపాటు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ ,కన్నడ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగులో కెరియర్ మొదలుపెట్టిన తర్వాత తెలుగు భాష కూడా నేర్చుకుంది. బెంగళూరును స్వస్థలంగా భావించే ఈమె అక్కడే బలమైన సంబంధాలను కూడా కొనసాగిస్తోంది. ముంబైలోని మానెక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో స్కూల్ విద్యను.. ఎంఎంకె కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ తో పట్టభద్రురాలు అయింది. భరతనాట్యంతో పాటు శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకుంది.

తమిళ్ సినిమా రంగంలోకి తొలిసారి అడుగు పెట్టక ముందే 2009లో మిస్ ఇండియా పోటీలలో పాల్గొని మిస్ ఇండియా టాలెంటెడ్ 2009 గౌరవాన్ని గెలుచుకున్నా ప్రారంభ రౌండు లోనే ఈమె ఎలిమినేట్ అయింది. ఇక 2010లో మిస్ ఇండియా సౌత్ 2010లో పాల్గొని రన్నరప్ స్థానాన్ని దక్కించుకుంది. తమిళ్ చిత్రం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.తెలుగులో దువ్వాడ జగన్నాథం, అలవైకుంటపురంలో అనే చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ గానే కాదు రంగస్థలం, కూలీ వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లతో కూడా ఆకట్టుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం జననాయగన్ సినిమాలో నటిస్తోంది ఈ సినిమా ఈమెకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. అలాగే కాంచన 4 తో పాటు ఒక తెలుగు చిత్రం, ఒక హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది.