పూజా హెగ్డేకి ఊహించని సర్ప్రైజ్.. ఫోటోలు వైరల్!
ముఖ్యంగా ఇది ఊహించని పరిణామం.. ఈ సర్ప్రైజ్ ఆమెకే కాదు.. ఈ సర్ప్రైజ్ సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
By: Madhu Reddy | 11 Oct 2025 7:11 PM ISTసెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఎక్కడైనా పబ్లిక్ లో కనిపించారంటే చాలు వారితో కరచాలనం చేయాలని, వారితో సెల్ఫీలు దిగాలని, వారితో ఒక్క మాటైనా మాట్లాడాలని, ఎంతోమంది అభిమానులు కలలు కంటూ ఉంటారు. ఫోటోగ్రాఫర్లైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడ కనిపించినా సరే ఫోటోలు తీస్తూ వారిని విసిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి ఫోటోగ్రాఫర్ల (పాపరాజీలు) నుండి అనూహ్యంగా ఒక ఊహించని సర్ప్రైజ్ అందుకుంది బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ముఖ్యంగా ఇది ఊహించని పరిణామం.. ఈ సర్ప్రైజ్ ఆమెకే కాదు.. ఈ సర్ప్రైజ్ సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. అక్టోబర్ 13వ తేదీన పూజా హెగ్డే పుట్టినరోజు.. 35 సంవత్సరాల పూర్తిచేసుకుని 36వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతోంది. మరోవైపు లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమాలో మోనిక పాటతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తాజాగా ముంబై ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. అక్కడ ఈమెకు ఊహించని సర్ప్రైజ్ ఒకటి ఎదురయింది. బ్లాక్ కలర్ క్రాప్ టాప్ పైన కోట్, మినీ స్కర్ట్ తో పాటూ ష్రగ్ ఇలా పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ లో దర్శనమిచ్చింది. విమానాశ్రయం నుండి బయటకి వస్తూ ఉండగా ఒక చిన్న సర్ప్రైజ్ బాక్స్ తో ఒక కెమెరామెన్ ఆమెను ఆశ్చర్యపరిచారు. మేడం ఆగండి.. మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అంటూ పిలిచి ఆమెకు ఆ బాక్స్ ఇచ్చారు.
అందులో కేక్ ఉంది. ఈ బహుమతిని తెరిచి.. మీరు కూడా కేక్ తినాలి అంటూ వారితో చెప్పింది. అలా వారితో కలిసి కేక్ తిని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.." నా పుట్టినరోజుకు ఇంకా రెండు రోజులు సమయం ఉంది. కానీ అప్పుడే మీరు అందించిన ఈ సర్ప్రైజ్ మరిచిపోలేనిది" అంటూ పూజా హెగ్డే తెలిపింది. మొత్తానికి అయితే రెండు రోజులు ముందే.. అభిమానుల వల్ల పుట్టిన రోజును ఎయిర్పోర్ట్ లో జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ.
పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దళపతి నటిస్తున్న జననాయగన్ సినిమాలో నటిస్తున్న ఈమె.. ఈ చిత్రంతో పాటు కాంచన 4, DQ41 వంటి సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ లు అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్న ఈమెకు ఇలా ఊహించని సర్ప్రైజ్ ఎదురయ్యింది.
పూజా హెగ్డే కెరియర్ తొలినాళ్ల విషయానికి వస్తే..'ఒక లైలా కోసం' అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించిన పూజా హెగ్డే.. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాలో నటించి బుట్ట బొమ్మగా పేరు దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది పూజా హెగ్డే.
