Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే బర్త్‌డే స్పెషల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ!

లీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈరోజు తన 36వ పుట్టినరోజును ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   13 Oct 2026 4:43 PM IST
పూజా హెగ్డే బర్త్‌డే స్పెషల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ!
X

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈరోజు తన 36వ పుట్టినరోజును ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ వరకు తన అందం, అద్భుతమైన డ్యాన్స్‌తో మిలియన్ల మంది అభిమానుల మనసులను గెలుచుకున్న ఈ భామకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా పూజా హెగ్డే ఫ్యాషన్ లుక్స్, విశేషాలు ఇప్పుడు చూద్దాం..

పిక్స్, వీడియోలతో నెట్టింట హంగామా:

బర్త్‌డే సందర్భంగా పూజా హెగ్డే షేర్ చేసిన గ్లామరస్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో బోట్ పై బ్లూ అండ్ వైట్ డ్రెస్సులో దిగిన పిక్స్, నిర్మూహ బ్రాండ్ బేబీ పింక్ గౌనులో మెరిసిన రాయల్ లుక్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఇక మినిమలిస్ట్ వైట్ బ్లౌజ్, క్లాసిక్ డెనిమ్ జీన్స్‌లో పూజ ఫ్యాషన్ శైలి 'బ్యూటీ ఇన్ సింప్లిసిటీ'కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది.

హీరోల స్పెషల్ విషెస్:

దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ హీరోలు పూజా హెగ్డేకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపారు. రాబోయే ‘శ్రీ శ్రీ’ చిత్రంలో కలిసి నటిస్తున్న దుల్కర్ సల్మాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. "పూజ కేవలం ఫన్ కో-యాక్టర్ మాత్రమే కాదు, ఒక గ్రేట్ గేమర్, ఆడియోఫైల్, కెమెరాలు, సినిమాలు, మ్యూజిక్ గురించి మాట్లాడే ఫెలో నెర్డ్" అని ప్రశంసించారు. ఇక బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరదాగా విషెస్ చెబుతూ తమ బాండింగ్‌ను పంచుకున్నారు.

చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో నెట్టింట ట్రెండింగ్:

కేవలం గ్లామర్‌తోనే కాకుండా తన మాస్ అండ్ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పూజ ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్‌తో 'బుట్టబొమ్మ', దళపతి విజయ్‌తో 'అరబిక్ కుతు', రామ్ చరణ్‌తో 'జిగేల్‌ రాణి', సూర్యతో ' కనిమా' వంటి పాటలు సోషల్ మీడియాను ఏలాయి. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలు విపరీతంగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఎంతోమంది డాన్సర్లకు స్ఫూర్తిగా నిలిచారు.

చేతిలో క్రేజీ ప్రాజెక్టులు:

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన పూజ, ప్రస్తుతం మళ్లీ క్రేజీ సినిమాలతో పలకరించేందుకు సిద్ధమవుతోంది. దుల్కర్ సల్మాన్‌తో కలసి రవి నీలకూడితి దర్శకత్వంలో వస్తున్న ‘శ్రీ శ్రీ’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇక దీనితో పాటు లారెన్స్ హర్రర్ ఫ్రాంచైజీ ‘కాంచన 4’ వంటి భారీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తూ మళ్లీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేందుకు సిద్ధమవుతోంది.

ఇక మొత్తానికి చూస్తే, పూజా హెగ్డే బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆమె ఫొటోలు, డ్యాన్స్ వీడియోల హంగామాతో నిండిపోయింది. విజయాపజయాలతో సంబంధం లేకుండా తన గ్లామర్, టాలెంట్‌తో అభిమానులను అలరిస్తున్న ఈ బుట్టబొమ్మ.. రాబోయే కొత్త సినిమాలతో మళ్లీ గ్రాండ్ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం..