బుట్టబొమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా!
DQ41 సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే పూజా పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Oct 2025 9:00 PM ISTతెలుగు తెరపై కొన్నాళ్లుగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కనిపించింది లేదు. కొన్ని సంవత్సరాల పాటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజాకు రీసెంట్ గా తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కోలీవుడ్ లో అడపాదడపా అవకాశాలొస్తున్నాయి కానీ తెలుగులో మాత్రం చేతికి వచ్చిన సినిమాలు కూడా కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లిపోయాయి.
దుల్కర్ సరసన హీరోయిన్ గా పూజా
ఇలాంటి టైమ్ లో పూజాకు ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ దక్కింది. దుల్కర్ సల్మాన్ హీరోగా ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలో పూజా హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. దుల్కర్ కెరీర్లో 41వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా DQ41 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తోంది. ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లి సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ.
ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బుట్టబొమ్మ
ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో పూజాకి ఒకప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. అందుకే అమ్మడికి అవకాశాలు దక్కడం లేదని అంతా అనుకున్నారు. కానీ పూజా క్రేజ్, మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదని ఆమె ఈ సినిమాకు అందుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి వింటే క్లారిటీ వస్తుంది. DQ41మూవీకి పూజా ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
DQ41 సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే పూజా పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. రవి నేలకుటిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
