Begin typing your search above and press return to search.

పూజా హెగ్డే క్యూట్ అండ్ క్లాసీ స్టైల్.. అవుట్ ఫిట్ ఖరీదు తెలిస్తే షాక్!

బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొత్త ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   6 Oct 2026 10:48 AM IST
పూజా హెగ్డే క్యూట్ అండ్ క్లాసీ స్టైల్.. అవుట్ ఫిట్ ఖరీదు తెలిస్తే షాక్!
X

బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొత్త ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాల పరంగా కాస్త సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌‌‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ బ్యూటీ, తాజాగా ఆమె ఎయిర్‌పోర్ట్ లుక్‌లో సింపుల్ క్యాజువల్ దుస్తులతో పాటు అత్యంత లగ్జరీ యాక్సెసరీస్‌ను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్యాజువల్ వేర్‌లోనూ రాయల్ లుక్‌ను రిఫ్లెక్ట్ చేస్తూ ఆమె కనిపిస్తున్న ఈ స్టైలిష్ ఔట్‌‌ఫిట్ పూర్తి ప్రైస్ బ్రేక్‌డౌన్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రాల్ఫ్ లారెన్ షర్ట్ మరియు లీవైస్ జీన్స్ ఈ క్యాజువల్ లుక్ కోసం పూజా హెగ్డే 'రాల్ఫ్ లారెన్' బ్రాండ్‌కు చెందిన చెక్డ్ షర్ట్‌ను ధరించారు. దీని సుమారు ధర రూ. 12,500గా ఉంది. దీనికి సరిపోయేలా ఆమె 'లీవైస్ 501 ఒరిజినల్ జీన్స్' ధరించగా, దాని ధర రూ. 7,999గా ఉంది. అలాగే ఈ డ్రెస్‌కు పర్‌ఫెక్ట్ ఫినిషింగ్ ఇస్తూ 'ఇసాబెల్ మారాంట్ లెక్సే బెల్ట్' ధరించారు, దీని ధర రూ. 28,000.

లగ్జరీ యాక్సెసరీస్ అండ్ స్టైలిష్ సన్‌గ్లాసెస్ :

ఈ ట్రెండీ లుక్‌ను మరింత హైలైట్ చేస్తూ ఆమె టార్టైజ్‌షెల్-రిమ్డ్ దీర్ఘచతురస్రాకార సన్‌గ్లాసెస్ ధరించింది.దాని ధర సుమారు రూ.38,000గా ఉంది. మెడలో సన్నని గోల్డ్ చైన్ నెక్లెస్, మ్యాచింగ్ గోల్డ్ లగ్జరీ వాచ్ దీని ధర రూ.11,50,000గా ఉంది. చేతికి బ్రాస్‌లెట్ ధరించి, భుజానికి టాన్ కలర్ లగ్జరీ షోల్డర్ బ్యాగ్ వేసుకుని పర్ఫెక్ట్ అర్బన్ లుక్‌లో మెరిసిపోయింది. ఆ బ్యాగ్ ధర రూ. 5,25,000గా ఉంది.

ఇక స్టైలిష్ అడిడాస్ స్నీకర్స్ ఈ మొత్తం క్యాజువల్ లగ్జరీ లుక్‌కు పర్‌ఫెక్ట్ కంఫర్ట్ ఇస్తూ ఆమె కాళ్లకు 'అడిడాస్ సాంబా ఓజీ స్నీకర్స్' ధరించారు. ఈ ట్రెండీ వైట్ స్నీకర్స్ అంచనా ధర రూ. 10,999గా ఉంది. సాధారణమైన ఎయిర్‌పోర్ట్ లుక్‌ను కూడా తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో హై-ఎండ్ లగ్జరీగా మార్చేస్తూ పూజా హెగ్డే ఫ్యాషన్ ప్రియులను మరోసారి ఫిదా చేశారు..

బాక్స్ ఆఫీస్ సవాళ్లు మరియు కొత్త ప్రాజెక్టులు:

ఇటీవల ఆమె నటించిన షాహిద్ కపూర్‌తో చేసిన'దేవ', సూర్యతో చేసిన'రెట్రో , విజయ్ తో చేసిన 'జన నాయగన్' అలాగే వరుణ్ ధావన్‌తో చేసిన రొమాంటిక్ కామెడీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' వంటి పాన్-ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొంటూ పూజా తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు. దుల్కర్ సల్మాన్, దీక్షిత్ శెట్టి, రమ్యకృష్ణన్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ-లింగ్వల్ రొమాంటిక్ డ్రామా 'శ్రీ శ్రీ', ఇంకా రాఘవ లారెన్స్ హారర్-కామెడీ 'కాంచన 4', అలాగే అహన్ శెట్టి సరసన నటిస్తున్న హిందీ యాక్షన్-రొమాన్స్ సినిమా 'సన్కి' చిత్రాలపైనే ఇప్పుడు ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. సినిమాల పరంగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ, తన గ్లామర్ అండ్ స్టైల్‌తో ఎప్పుడూ ట్రెండ్‌లో నిలుస్తున్నారు...