లేడీ మేనేజర్ ఏకంగా 38 కోట్లతో విలాసవంతమైన ప్లాట్లు!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఎంతో నమ్మకస్తురాలైన మేనేజర్ పూజా గుర్నాని మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు సినిమా విశేషాలతో కనిపించే పూజా గుర్నానీ ఈసారి రియల్ వెంచర్ పెట్టుబడితో హాట్ టాపిక్ గా మారింది.
By: Srikanth Kontham | 24 April 2026 8:45 AM ISTబాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఎంతో నమ్మకస్తురాలైన మేనేజర్ పూజా గుర్నాని మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు సినిమా విశేషాలతో కనిపించే పూజా గుర్నానీ ఈసారి రియల్ వెంచర్ పెట్టుబడితో హాట్ టాపిక్ గా మారింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమె చేసిన భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి అందుకు కారణమైంది. బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని హామ్లెట్ అనే లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లో పూజా -ఆమె కుటుంబ సభ్యులు ఏకంగా మూడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. ఈ లావాదేవీ విలువ 38.21 కోట్లుగా ఉండటం బి-టౌన్‌లో చర్చనీయాంశమైంది. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ జాప్‌కీ అందించిన సమాచారం ప్రకారం ఈ మూడు ఫ్లాట్లు కలిపి దాదాపు 3,923 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.
ఈ భారీ డీల్‌కు సంబంధించి పూజా ఆమె కుటుంబం ఏప్రిల్ 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కొనుగోలు కోసం దాదాపు 2.29 కోట్ల రూపాయలను స్టాంప్ డ్యూటీగా చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబై వంటి నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతోన్న వేళ ఒక సెలబ్రిటీ మేనేజర్ ఇంతటి భారీ పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ మూడు అపార్ట్‌మెంట్లలో ఒకటి 1189 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. దీని విలువ 12.33 కోట్లుగా ఉంది. మిగిలిన రెండు ఫ్లాట్లు ఒక్కొక్కటి 1367 చదరపు అడుగుల విస్తీర్ణంతో 12.94 కోట్లు చొప్పున అమ్ముడయ్యాయి.
ఈ ఫ్లాట్లతో పాటు పూజా కుటుంబానికి ఆ బిల్డింగ్‌లో ఏడు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా కేటాయించబడ్డాయి.
బాంద్రా ప్రాంతం సెలబ్రిటీలకు కేంద్రబిందువు కావడం అందులోనూ షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్ కు సమీపంలోనే ఈ ప్లాట్లు ఉండటం గమనార్హం. పూజా గుర్నాని గత పదేళ్లుగా షారుఖ్ ఖాన్‌కు వ్యక్తిగత మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతలే కాకుండా షారుఖ్ కుటుంబ సభ్యులతో కూడా ఆమెకు అత్యంత సన్నిహిత సంబంధాలు న్నాయి. షారుఖ్ మేనేజర్‌గా ఆమెకు లభిస్తున్న గుర్తింపు , ఆదాయం, ఈ స్థాయి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కారణాలుగా చెప్పొచ్చు. గతంలో కూడా పూజ ముంబైలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను షారుఖ్ భార్య గౌరీ ఖాన్ స్వయంగా ప్లాన్ చేయడం విశేషం.
ప్రస్తుతం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ అగ్రపథంలో దూసుకుపోతుంది. ముఖ్యంగా బాంద్రా, జుహు , వర్లీ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్టార్ హీరోలు, దర్శకులే కాకుండా వారి వద్ద పనిచేసే ఉన్నత స్థాయి మేనేజర్లు , టెక్నీషియన్లు కూడా ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. పూజా గుర్నాని చేసిన ఈ కొనుగోల, బాలీవుడ్‌లో సెలబ్రిటీ మేనేజర్ల పెరుగుతున్న హోదాకు నిదర్శనంగా చెప్పొచ్చు. పూజా గుర్నాని కష్టంతో , ప్రతిభతో ఈ స్థాయికి చేరుకోవడం స్పూర్తిదాయకమైంది. షారుఖ్ ఖాన్ వంటి గ్లోబల్ స్టార్ వెనుక ఉండి ఆయన వ్యవ హారాలను చక్కదిద్దడమే కాకుండా? వ్యక్తిగత జీవితంలో కూడా సక్సెస్‌ఫుల్ ప్రొఫెషనల్‌గా ఎదిగారు.
