ఆ హీరో భార్యలో ఇంత ట్యాలెంట్ ఉందా?
స్టార్ హీరోల కుటుంబాలంటే? అభిమానులకు కూడా కొంత వరకూ ఓ అవగాహన ఉంటుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా? నటులుతో జీవితం పంచుకున్న అనంతరం సెలబ్రిటీ హోదాలో కొనసాగుతారు.
By: Srikanth Kontham | 12 Dec 2025 12:00 AM ISTస్టార్ హీరోల కుటుంబాలంటే? అభిమానులకు కూడా కొంత వరకూ ఓ అవగాహన ఉంటుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా? నటులుతో జీవితం పంచుకున్న అనంతరం సెలబ్రిటీ హోదాలో కొనసాగుతారు. ఏదో సంద ర్భంలో వాళ్ల వివరాలు కూడా బయటకొస్తుంటాయి. కానీ బాలీవుడ్ హీరో సన్నిడియోల్ కుటుంబం గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువ మందికే. ఆయన వ్యక్తిగత జీవితాన్ని లైమ్ లైట్ కి దూరంగా ఉంచడానికే ఇష్ట పడతారు. ముఖ్యంగా సన్ని డియోల్ భార్య గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమా ప్రచారాలకు దూరంగా ఉండటంతో? చాలా మందికి ఆమె గురించి తెలియదు.
ఆమె పేరు పూజా డియోల్. లండన్ లో జన్మించిన పూజ భారత సంతతికి చెందిన కృష్ణ దేవ్ మహల్ కాగా, తల్లి జూన్ సారా మహల్ బ్రిటన్‌కు చెందినవారు. సారా మహాల్ బ్రిటన్ రాజవంశంతో బంధుత్వం ఉందని కొన్ని కథనాలు పేర్కొంటు న్నాయి. అయితే సన్నీ డియోల్- పూజల వివాహం 1984 లో లండన్ లో రహస్యంగా జరిగినట్లు చెబుతారు. ఇందుకు ఓ కారణం కూడా తెరపైకి వస్తోంది. సన్ని డియోల్ నటుడిగా ఎదుగుతోన్న సమయంలో వివాహం విషయం బయటకు వస్తే అతడి కెరీర్ పై ప్రభావం పడుతుందని సీక్రెట్ గా ఉంచినట్లు చెబుతున్నారు.
లండన్ మ్యాగజైన్ లో పెళ్లి ఫోటోలు ప్రచురితం అయ్యే వరకూ గాను పెళ్లి జరిగిందన్న విషయం బాలీవుడ్ కి తెలియదు. ఇదంతా ఒక కోణమైతే? పూజా డియోల్ 1996లో `హిమ్మత్` అనే చిత్రంలో నటించారు. అలాగే ధర్మేంద్ర, సన్నిడియోల్ నటించిన `యమ్లా పగ్లా దీవానా 2` చిత్రానికి కూడా పూజ కథ అందించారు. ఆ తర్వాత మరే సినిమాకు పూజా డియోల్ పని చేయలేదు. కుటుంబ జీవితానికే పరిమితమయ్యారు. బాలీవుడ్ లో రైటర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అక్కడ లేడీ రైటర్లు చాలా మంది ఉన్నారు. దర్శకులుగా కూడా సత్తా చాటిన మహిళా డైరెక్టర్లు ఉన్నారు.
కానీ పూజా డియోల్ మాత్రం ఆ తరహా ప్రయత్నాలేవి చేసినట్లు కనిపించలేదు. రెండు చిత్రాలతకే సినిమా కెరీర్ ని ముగించి కుటుంబ జీవితానికే పరిమిత మయ్యారు. సన్ని డియెల్ నటించిన సినిమా వేడుకల్లో కూడా ఎక్కడా ఆమె కనిపించలేదు. వెకేషన్ కు వెళ్లిన ఫోటోలు కూడా ఏనాడు బయటకు రాలేదంటే? ఎంత ప్రయివేట్ గా ఉంటున్నారు అన్నది అర్దం చేసుకోవచ్చు. అయితే చిన్న కుమారుడు రాజ్‌వీర్ డియోల్ నటించిన `దోనో` ప్రీమియర్ కావడంతో? తొలిసారి మీడియా ముందుకు రావడంతోనే ఈ డిస్కషన్ అంతా షురూ అయింది.
