Begin typing your search above and press return to search.

ఆడవాళ్ల‌తో ఫైట్ చేసేదే లేద‌న్న‌ స్టార్ హీరో

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్లో ఫ్యాన్స్ మ‌ర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో శ‌క్తి ఒక‌టి. ఈ పేరు వింటేనే తార‌క్ ఫ్యాన్స్ భ‌య‌ప‌డతారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Feb 2026 5:00 AM IST
ఆడవాళ్ల‌తో ఫైట్ చేసేదే లేద‌న్న‌ స్టార్ హీరో
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్లో ఫ్యాన్స్ మ‌ర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో శ‌క్తి ఒక‌టి. ఈ పేరు వింటేనే తార‌క్ ఫ్యాన్స్ భ‌య‌ప‌డతారు. ఆ సినిమా మిగిల్చిన అనుభ‌వాలు, అనుభూతులు అలాంటివి మ‌రి. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో 2011లో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ మూవీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. శ‌క్తి మూవీని మీరంతా మ‌ర్చిపోయినా, నేను మ‌ర్చిపోలేనని ఎన్టీఆర్ ఓ సంద‌ర్భంలో కామెంట్స్ కూడా చేశారు.

ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ చేసిన‌ ఈ సినిమా ఫ్లాపవ‌డానికి రీజ‌న్స్ ఎన్నో ఉన్నాయి. ఫ‌స్టాఫ్ షూటింగ్ అయిపోయాక ఈ మూవీని సోషియో ఫాంట‌సీ మూవీగా మార్చాల‌ని నిర్మాత ఇచ్చిన స‌ల‌హాతో క‌థంతా మారిపోయింద‌ని డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ ఓ ఇంట‌ర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా న‌టించ‌గా, మంజ‌రి ఫ‌డ్నీస్ మ‌రో హీరోయిన్ గా న‌టించారు.

విల‌న్ గా న‌టించిన పూజా బేడీ

శ‌క్తి మూవీలో ఫ‌క్తూనీ అనే విల‌న్ క్యారెక్ట‌ర్ ను బాలీవుడ్ న‌టి పూజా బేడీ చేసిన విష‌యం తెలిసిందే. శ‌క్తి డిజాస్ట‌ర్ అవ‌డంతో పూజా బేడీకి త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలు రాలేదు. ఇప్పుడు బ‌రాబ‌ర్ ప్రేమిస్తా మూవీలో పూజా బేడీ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించగా, ఆ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో ఆమె ఎన్టీఆర్ గొప్ప‌ద‌నాన్ని బ‌య‌ట‌పెట్టారు. పూజా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ శ‌క్తి షూటింగ్ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

తార‌క్‌ది ఎంతో గొప్ప వ్య‌క్తిత్వం

శ‌క్తి మూవీలో త‌న‌ది విల‌న్ రోల్ అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ మాత్రం తాను మ‌హిళ‌ల‌తో ఫైట్ చేయ‌న‌ని నిర్మొహ‌మాటం లేకుండా చెప్పార‌ని, క‌థ ప‌రంగా మ‌హిళ‌తలతో ఫైట్ చేసే అవ‌స‌ర‌మున్న‌ప్ప‌టికీ ఆయ‌న అస్స‌లు ఒప్పుకోలేద‌ని, ఎలాంటి పాత్ర అయినా స‌రే తాను మ‌హిళ‌ల‌తో ఫైట్ చేయ‌న‌ని చెప్పార‌ని, ఎన్టీఆర్ కు అంతటి గొప్ప వ్య‌క్తిత్వముంద‌ని పూజా బేడీ అన్నారు.

ఇప్ప‌టికే ఎన్టీఆర్ మంచిత‌నం గురించి ఆయ‌న‌తో ప‌ని చేసిన ఎంతో మంది హీరోయిన్లు గొప్ప‌గా చెప్ప‌గా, తాజాగా పూజా బేడీ కూడా ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. దీన్ని బ‌ట్టి ఎన్టీఆర్ సినిమాల్లో అయినా, రియ‌ల్ లైఫ్ లో అయినా మ‌హిళ‌ల‌కు ఎంతో గౌర‌వ‌మిస్తార‌ని అర్థ‌మ‌వుతుంది. త‌మ హీరో గురించి పూజా బేడీ చేసిన కామెంట్స్ ను ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అత‌ని మంచి మ‌న‌సుని ప్ర‌శంసిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విష‌యానికొస్తే ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.