Begin typing your search above and press return to search.

నాగార్జున 'గ్రీకువీరుడు' ఫేం పూజా బాత్రా స్టైలిష్ లుక్

సీనియ‌ర్ నటి కం మోడల్ పూజా బాత్రా చాలా కాలంగా విదేశాల‌లో సెటిల‌య్యారు. అయినా భార‌తీయ అభిమానుల‌కు ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో నిరంత‌రం ట‌చ్ లోనే ఉన్నారు.

By:  Sivaji Kontham   |   22 Aug 2026 3:00 PM IST
నాగార్జున గ్రీకువీరుడు ఫేం పూజా బాత్రా స్టైలిష్ లుక్
X

అక్కినేని నాగార్జున స‌ర‌స‌న గ్రీకు వీరుడు(1998), విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న `ప‌విత్ర ప్రేమ`(1998) చిత్రాల్లో న‌టించారు పూజా బాత్రా. ఈ భామ అంద‌చందాలు, స్టైల్ కంటెంట్ కు ఇక్క‌డా అభిమానులు ఏర్ప‌డ్డారు. అయితే పూజా బాత్రా ఆ త‌ర్వాత బాలీవుడ్ లోనే ఎక్కువ కాలం క‌థానాయిక‌గా కొన‌సాగారు. ఇప్పుడు లేట్ ఏజ్ లో బాత్రాజీ ఏం చేస్తున్నారు? అన్న‌ది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి..




సీనియ‌ర్ నటి కం మోడల్ పూజా బాత్రా చాలా కాలంగా విదేశాల‌లో సెటిల‌య్యారు. అయినా భార‌తీయ అభిమానుల‌కు ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో నిరంత‌రం ట‌చ్ లోనే ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ హాట్ టాపిగ్గా మారుతున్నారు. తాజా పోస్ట్‌లో అద్భుతమైన స్టైల్- యూనిక్ లుక్ తో పూజా త‌న‌ అభిమానులను అలరించారు. వెస్ట్ హాలీవుడ్, కాలిఫోర్నియాలో చిత్రీకరించిన ఈ ఫోటోషూట్‌లో పూజా ధరించిన తెల్లటి క్రోషే డ్రెస్ త‌న అందాన్ని మరింత రెట్టింపు చేసింది. `లేస్‌డ్ ఇన్ లైట్` అనే క్యాప్షన్‌తో బాత్రా షేర్ చేసిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా దూసుకెళుతోంది.




ఈ ప్రత్యేకమైన ఫోటో షూట్‌కు బ్రియాన్ బుచ్‌కావిట్జ్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. ఫోటోగ్రఫీ విభాగాన్ని ఏకెస్ డాట్ కామ్ ప్రతిభావంతంగా నిర్వహించింది. పూజా బాత్రా ధరించిన దుస్తులు కోస్టల్ ఫెమ్మే బ్రాండ్‌కు చెందినవి కాగా.. త‌ను ధరించిన రింగులు `రామీ బ్రూక్` బ్రాండ్‌వి. అలాగే పూజా స్టైలిష్ పాదరక్షలు 4 సెస్ డిజైన్ చేసినవి. ఈ కాంబినేషన్ మొత్తం పూజా బాత్రాకు మోడ్ర‌న్ అండ్ రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టింది.




ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే అభిమానుల నుండి దీనిపై ప్రశంసల వర్షం కురిసింది. కామెంట్ సెక్షన్ మొత్తం లవ్, ఫైర్, హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది. అభిమానులు పూజాను `ఎటర్నల్ బ్యూటీ`, `ఎలిగెన్స్ క్వీన్` అని కొనియాడుతున్నారు. కాలం మారుతున్నా ఈ బ్యూటీ గ్లామర్ - ఫిట్‌నెస్ తగ్గలేదని.. నేటికీ ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన పూజా బాత్రా 1990ల చివరలో విరాసత్, నాయక్ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా భారతీయ సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నాయ‌క్ అనువాదం తెలుగులోను విడుద‌లై బాగానే ఆడింది. నటిగానే కాకుండా మోడల్‌గా పూజా సాధించిన గుర్తింపు నేటికీ సజీవంగా ఉంది. ఫ్యాషన్ పై త‌న‌కున్న అభిరుచి- ఫిట్‌నెస్ లైఫ్‌స్టైల్ ఆమెను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలబెడుతున్నాయి.

ప్రస్తుతం విదేశాలలో నివసిస్తున్నా.. రెగ్యుల‌ర్‌గా తన కొత్త ప్రాజెక్ట్‌లు, ఫ్యాషన్ షూట్‌లకు సంబంధించిన విశేషాలను సోష‌ల్ మీడియాల ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ లేటెస్ట్ హాలీవుడ్ ఫోటోషూట్ ద్వారా పూజా బాత్రా మరోసారి ఫ్యాషన్ ప్రపంచంలో తన శైలికి సాటిలేనిదని నిరూపించారు. పూజా చూపుతున్న ఈ గ్లామర్ .. డ్రెస్సింగ్ సెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూజా తిరిగి న‌ట‌న‌లోకి వ‌స్తున్నారా లేదా? అనేదానిపై మ‌రిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది.