పీపుల్ మీడియా విజయోత్సాహం.. కానుకలు అందుకేనా..?
ఐతే పీపుల్ మీడియా అఫీషియల్ గా అందుకున్న సూపర్ హిట్ సినిమా మిరాయ్.
By: Ramesh Boddu | 17 Sept 2025 9:47 AM ISTసక్సెస్ ఇచ్చే కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ సక్సెస్ కోసమే పనిచేస్తుంటారు. ఒక సూపర్ హిట్ మరికొన్ని సినిమాలకు మంచి జోష్ ఇస్తుంది. ఇక ఆ నిర్మాణ సంస్థకు అయితే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఎంతో ఎంకరేజ్మెంట్ అందిస్తుంది. టాలీవుడ్ లో వరుస భారీ సినిమాలు చేస్తూ వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లేటెస్ట్ గా ఒక సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. మిరాయ్ సినిమాతో ఈ సంస్థ ఒక క్రేజీ హిట్ సొంతం చేసుకుంది. తేజ సజ్జ, మంచు మనోజ్ నటించిన ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు.
ప్యాషన్ తో సినిమాలు చేస్తూ..
ఈ సినిమా సక్సెస్ మీద ముందు నుంచి మేకర్స్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్ కొట్టింది. కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. ఐతే పీపుల్ మీడియా అఫీషియల్ గా అందుకున్న సూపర్ హిట్ సినిమా మిరాయ్. అందుకే ఈ సినిమా సక్సెస్ కి కారణమైన డైరెక్టర్, హీరో ఇద్దరికి భారీ కానుకలు అందిస్తున్నారట. మిరాయ్ సినిమా సక్సెస్ లో ముఖ్య పాత్ర పోషించిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి హీరో తేజ సజ్జకి ఇద్దరికి కార్లను గిఫ్ట్ గా ఇస్తున్నట్టు తెలుస్తుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్యాషన్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఐతే మొదటి నుంచి ఎందుకో వీరికి సక్సెస్ అందలేదు. భారీ సినిమాలు చేస్తున్నా సరే సక్సెస్ లేట్ అవుతూ వచ్చింది. ఐతే మిరాయ్ తో ఈ బ్యానర్ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ఇలా రావడానికి కారణమైన కార్తీక్, తేజ సజ్జకి నిర్మాతలు విలువైన బహుమతులు ఇస్తున్నారు.
హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మిరాయ్ కోసం చేసిన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా సొంతంగా వాళ్ల కంపెనీలోనే చేశారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సీజీ వర్క్ చేస్తున్నారు. ఇక ఇదే బ్యానర్ లో నెక్స్ట్ రాబోతున్న రాజా సాబ్ సినిమాతో కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ కనిపిస్తుంది.
ప్రభాస్ సినిమా అంటే ఇక ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. రాజా సాబ్ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇస్తుంది. మరి మిరాయ్ తో మొదలైన పీపుల్ మీడియా విజయోత్సాహం ఇదే విధంగా వరుస సక్సెస్ లతో కొనసాగుతుందేమో చూడాలి. ఫ్లాపులు పడుతున్నా లెక్క చేయకుండా వరుస భారీ సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా సక్సెస్ రుచి చూశాక మరింత ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
