పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఈసారి సేఫ్ గేమ్
భారీ బడ్జెట్ తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు.
By: M Prashanth | 31 Aug 2025 10:26 AM ISTటాలీవుడ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్.. టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన విషయం తెలిసిందే. W/O రామ్ మూవీతో ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన ఆ సంస్థ.. ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించింది. మంచి విజయాలు కూడా అందుకుంది. కొంతకాలంగా భారీ బడ్జెట్ తో చిత్రాలు రూపొందిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.
కానీ 2024లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు కలిసి రాలేదని చెప్పాలి. పలు సినిమాలు రూపొందించి థియేటర్స్ లో రిలీజ్ చేయగా.. అవి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయాయి. దీంతో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అప్ కమింగ్ సినిమాలపై హోప్స్ పెట్టుకున్నారు బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్.
ప్రస్తుతం వివిధ సినిమాలు రూపొందిస్తుండగా.. ఆ లిస్ట్ లో రాజా సాబ్, మిరాయ్, గరివిడి లక్ష్మి, తేజ సజ్జాతో మరో మూవీ వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు తేజ సజ్జా మిరాయ్ ను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది.
భారీ బడ్జెట్ తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే రీసెంట్ గా సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ సహా అన్ని డీల్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు నిర్మాత విశ్వప్రసాద్.
గత ఏడాది పలు సినిమాలతో నష్టపోయిన ఆయన.. ఇప్పుడు మిరాయ్ రిలీజ్ కు ముందే సేఫ్ జోన్ లో ఉన్నారు. బడ్జెట్ లో ఎక్కువ భాగం నాన్ థియేట్రికల్ డీల్ ద్వారా సొంతం చేసుకున్నారు. ట్రైలర్ కు వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే.. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా లాభాలే లాభాలు అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
థియేట్రికల్ డీల్ చాలా రీజనబుల్ గా ఉండడం వల్ల.. మిరాయ్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి వెళ్లడం ఈజీ. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ధర్మ ప్రొడక్షన్స్, హోంబేల్ ఫిల్మ్స్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, గోకులం ఫిల్మ్స్ వంటి నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తోంది. అంచనాలకు తగ్గట్టు మిరాయ్ రాణిస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి బిగ్ జాక్ పాట్ అవ్వనుంది. మరేం జరుగుతుందో చూడాలి.
