Begin typing your search above and press return to search.

సుదర్శన్‌ లో 'పెద్ది' రిలీజ్ అవుతుందా? అంతా సెట్ అయిందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. నైజాం ప్రాంతంలో థియేటర్ల కేటాయింపుల అంశం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   1 Jun 2026 11:08 PM IST
సుదర్శన్‌ లో పెద్ది రిలీజ్ అవుతుందా? అంతా సెట్ అయిందా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. నైజాం ప్రాంతంలో థియేటర్ల కేటాయింపుల అంశం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌ లో అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ ‌లో సినిమా ఉంటుందా? లేదా? అన్న చర్చ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సాగుతోంది.

ఇటీవల విడుదలైన నైజాం థియేటర్ల ఫస్ట్ లిస్ట్ లో సుదర్శన్ 35 ఎంఎం పేరు కనిపించకపోవడంతో అభిమానుల్లో డౌట్లు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూషన్ వర్గాల మధ్య రెవెన్యూ షేరింగ్ విధానంపై కొనసాగుతున్న చర్చలేనని టాక్ వినిపించింది. ప్రస్తుతం నైజాంలో రెంటల్ సిస్టమ్, పర్సెంటేజ్ సిస్టమ్ అంశాలపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.

సుదర్శన్ థియేటర్‌ లో గత కొంతకాలంగా విడుదలవుతున్న పెద్ద సినిమాలు ఎక్కువగా పర్సెంటేజ్ బేస్డ్ అగ్రిమెంట్లతోనే ప్రదర్శితమవుతున్నాయి. ముఖ్యంగా భగవంత్ కేసరి తర్వాత వచ్చిన పెద్ద చిత్రాలన్నీ ఆ విధానంలో విడుదలయ్యాయి. అదే తరహా ఒప్పందం పెద్ది విషయంలో కూడా ఉండాలని థియేటర్ యాజమాన్యం కోరినట్లు సమాచారం. దీంతో ఫస్ట్ లిస్ట్ లో థియేటర్ పేరు లేకపోయినా, చర్చలు మాత్రం కొనసాగుతున్నాయని వార్తలు వచ్చాయి.

మరోవైపు ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్, మైత్రి డిస్ట్రిబ్యూషన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగిన బిజినెస్ డిస్కషన్స్ కూడా మరింత ఇంపార్టెన్స్ తీసుకొచ్చాయి. నైజాం ఏరియాలో ప్రముఖ థియేటర్ల కేటాయింపు, షో నిర్వహణ, రెవెన్యూ మోడల్ వంటి అంశాలపై ఇరు వర్గాలు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దికి అన్ని మెయిన్ థియేటర్లు దక్కుతాయా లేదా అన్న ఆసక్తి నెలకొంది.

అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పరిస్థితులు పాజిటివ్ గా మారినట్లు కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ వర్గాలు, థియేటర్ యాజమాన్యాల మధ్య చర్చలు ముందుకు సాగుతున్నాయని, విడుదలకు ముందే అన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాలకు సుదర్శన్ థియేటర్‌ కు ఉన్న ప్రత్యేక అనుబంధం ఉండగా, చివరి నిమిషంలోనైనా ఒప్పందం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

నిజానికి హైదరాబాద్‌ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియా టాలీవుడ్ బడా హీరోల సినిమాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌ గా భావిస్తారు. అందులోనూ సుదర్శన్ థియేటర్‌ లో ఫస్ట్ డే ఫస్ట్ షో క్లైమేట్ స్పెషల్ గా ఉంటుంది. దీంతో ఇప్పుడు పెద్ది అక్కడ ప్రదర్శితమవుతునట్లేనని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఫస్ట్ లిస్ట్ లో సుదర్శన్ పేరు లేకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించినా.. జరిగిన చర్చల నేపథ్యంలో సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ ఫైనల్ లిస్ట్ లో సుదర్శన్ సహా అన్ని ప్రధాన థియేటర్లు చేరతాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.