Begin typing your search above and press return to search.

పెద్ది.. ఆ రెండు తప్పులు ఎందుకు చేశారో?

అయితే సినిమా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సమయంలో మూవీ టీమ్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

By:  M Prashanth   |   17 Jun 2026 7:00 PM IST
పెద్ది.. ఆ రెండు తప్పులు ఎందుకు చేశారో?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలై రెండు వారాలు దాటినా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. సాధారణంగా పెద్ద సినిమాలు తొలి వీకెండ్‌ లోనే ఎక్కువ వసూళ్లు సాధించి, ఆ తర్వాత మెల్లగా తగ్గుతుంటాయి. కానీ పెద్ది మాత్రం రెండో వారంలోనూ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగింది.

అయితే సినిమా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సమయంలో మూవీ టీమ్ తీసుకున్న రెండు నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇవి అవసరమా? లేక తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొదటి నిర్ణయం ఫుల్ సాంగ్స్ రిలీజ్. ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న చికిరి చికిరి, హెల్లల్లో సాంగ్స్ వీడియోలను థియేట్రికల్ రన్ కొనసాగుతున్న సమయంలోనే యూట్యూబ్‌ లో విడుదల చేశారు.

సాధారణంగా సినిమా థియేటర్లలో స్ట్రాంగ్ గా ఆడుతున్నప్పుడు మెయిన్ వీడియో సాంగ్స్‌ ను బయటకు రిలీజ్ చేయడాన్ని కొంతమంది సినీ ప్రియులు తప్పు పడుతున్నారు. ఆడియన్స్ సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిన అట్రాక్షన్ లో సాంగ్స్ కూడా ఒకటి. అలాంటి సమయంలో కంప్లీట్ వీడియోలను రిలీజ్ చేయడం వల్ల థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

రెండోది కొత్త సీన్స్ యాడ్ చేయడం. పెద్ది చిత్రంలో కొన్ని సీన్స్ యాడ్ చేయనున్నట్లు వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుచ్చిబాబు కూడా అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా మరోసారి థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఇప్పటివరకు అలాంటి కొత్త సన్నివేశాలు యాడ్ చేయకపోవడం గమనార్హం. దీంతో ప్రేక్షకుల్లో కొంత గందరగోళం నెలకొంది.

కొత్త కంటెంట్ వస్తుందనే అంచనాలు పెంచి, చివరికి ఎలాంటి ఛేంజెస్ కనిపించకపోవడం చర్చకు దారితీసింది. అసలు ఆ రెండు నిర్ణయాల అవసరం ఏమిటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎందుకంటే పెద్ది ఇప్పటికే మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. భారీ స్థాయిలో ప్రమోషన్లు చేయాలంటే చేయవచ్చు. కానీ ఆడియెన్స్ రెస్పాన్స్ బాగున్న టైమ్ లో నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం మూవీపై ఎఫెక్ట్ పెద్దగా ఉండదని చెబుతున్నారు.

పెద్దిపై ఏర్పడిన మాస్ క్రేజ్, రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు తెరకెక్కించిన విలేజ్ బ్యాక్ డ్రాప్, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ సినిమాకు మెయిన్ అసెట్స్ గా నిలిచాయని అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో జరిగే చర్చలు లేదా ప్రమోషనల్ డిసెషన్స్ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో వీడియో సాంగ్స్ రిలీజ్, కొత్త సీన్స్ యాడ్ చేస్తామని అనౌన్స్ చేయడం పెద్ది చుట్టూ కొత్త చర్చకు కారణమయ్యాయి. ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు మాత్రం మూవీ టీమ్ సమాధానం చెప్పాల్సి ఉంది.