Begin typing your search above and press return to search.

‘పెద్ది’ రిలీజ్ డేట్.. బుచ్చిబాబు పర్ఫెక్ట్ బాక్సాఫీస్ ప్లాన్

ఒక భారీ సినిమా వస్తోంది అంటే అది ఏ రోజున థియేటర్లలోకి అడుగుపెడుతుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తుంటాయి.

By:  M Prashanth   |   27 April 2026 9:42 AM IST
‘పెద్ది’ రిలీజ్ డేట్.. బుచ్చిబాబు పర్ఫెక్ట్ బాక్సాఫీస్ ప్లాన్
X

ఒక భారీ సినిమా వస్తోంది అంటే అది ఏ రోజున థియేటర్లలోకి అడుగుపెడుతుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తుంటాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అంటే ఆ లెక్కలు వందల కోట్లతో ముడిపడి ఉంటాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' చిత్రం విషయంలో కూడా ఇన్నాళ్లూ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఒక వేదికపై దర్శకుడు స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ మొదలైంది.

అసలు విషయం ఏంటంటే, ధనుష్ ‘కారా’ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న బుచ్చిబాబు.. 'పెద్ది' చిత్రాన్ని 2027 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు శుక్రవారం కావడంతో వీకెండ్ అడ్వాంటేజ్ తో పాటు, బాక్సాఫీస్ వద్ద సోలో రన్ ఉండేలా పక్కాగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం శృతి హాసన్ తో కలిసి చేస్తున్న స్పెషల్ సాంగ్ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది.

మరో నాలుగు రోజుల్లో మొత్తం చిత్రీకరణ పూర్తయిపోతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్, రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ మీద టీమ్ ఫోకస్ పెట్టనుంది. ఈ రిలీజ్ డేట్ సెలెక్షన్ వెనుక బుచ్చిబాబు వేసిన బిజినెస్ స్ట్రాటజీ చాలా తెలివిగా కనిపిస్తోంది. జూన్ 25న విడుదల చేయడం వల్ల జూలై రెండో వారం వరకు పాన్ ఇండియా స్థాయిలో మరో పెద్ద సినిమా పోటీలో లేదు. అంటే చరణ్ కు దాదాపు రెండు వారాల పాటు సోలో థియేట్రికల్ విండో దొరుకుతుందన్నమాట.

గతంలో కొన్ని భారీ చిత్రాలు క్లాష్ అవ్వడం వల్ల నష్టపోయిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఎక్కడా పోటీ లేకుండా జాగ్రత్త పడ్డారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఈ గ్యాప్ పెద్ద ప్లస్ అవుతుంది. జూన్ నెలాఖరున చరణ్ వస్తున్నాడంటే, ఆ సమయంలో ప్లాన్ చేసుకున్న మిగతా మీడియం బడ్జెట్ సినిమాలు తమ డేట్లను మార్చుకునే అవకాశం ఉంది.

ఒక పెద్ద సినిమా బాక్సాఫీస్ ను ఏలుతున్నప్పుడు వారం పది రోజుల గ్యాప్ ఇవ్వడం ఇండస్ట్రీలో సహజం. చరణ్ సోలో మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యం కావడం వల్ల బి, సి సెంటర్ల ఆడియన్స్ కు కూడా ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుంది. ప్రమోషన్లకు కూడా తగినంత సమయం దొరికేలా ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇక 'పెద్ది' టీమ్ విడుదల చేసిన డేట్ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. మరి ఈ రెండేళ్ల నిరీక్షణ తర్వాత 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.