Begin typing your search above and press return to search.

శ్రీలంక‌లో వాళ్లిద్ద‌రి యాక్ష‌న్ ఏ రేంజ్ లో అంటే!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది.

By:  Srikanth Kontham   |   23 Oct 2025 4:36 PM IST

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. హైద‌రాబాద్, మైసూర్, శ్రీలంక లాంటి ప్ర‌దేశాల్లో ఎన్నో ఎగ్జోటిక్ లోకేష న్స్ లో షూటింగ్ చేసారు. రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ స‌హా ప్ర‌ధాన పాత్ర‌ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. సిని మా క‌బ‌డ్డీ, స‌హా కుస్తీ ఆట‌తో కూడిన క‌థ కావ‌డంతో? అంత‌ర్జాతీయ స్టేడియాల్లో సైతం ఆట‌ల‌కు సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని లీక్డ్ ఫోటోలు నెట్టింట ఆస‌క్తిక‌రంగా మారాయి.

హీరో-డైరెక్ట‌ర్ ఒకే ప్లైట్ లో:

అయితే షూటింగ్ మొద‌లైన నాటి నుంచి పెద్ద‌గా విరామం తీసుకోలేదు. మ‌ధ్య‌లో చిన్న‌పాటి విరామాలు త‌ప్ప నిర్విరామంగానే టీమ్ ప‌ని చేసింది. ఈ నేప‌థ్యంలోనే షూటింగ్ చ‌కాచ‌కా పూర్త‌యింది. తాజాగా టీమ్ త‌దుప‌రి షెడ్యూల్ కు రెడీ అయింది. ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ శ్రీలంక‌లో జ‌రుగుతోంది. దీనిలో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు శ్రీలంక చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని గంట‌ల క్రిత‌మే శ్రీలంక ప్లైట్ ఎక్కుతున్న‌ట్లు ఎయిర్ పోర్టులో క‌నిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతోనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

శ్రీలంక సీన్స్ హైలైట్ గా:

ఈ సినిమాకు సంబంధించి శ్రీలంక వెళ్ల‌డం ఇది రెండ‌వ సారి కావొచ్చు. హైద‌రాబాద్ లో షూటింగ్ అనంత‌రం కంటున్యూటీగా ఓసారి శ్రీల‌కం వెళ్లి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. అనంత‌రం బ్రేక్ ఇచ్చి మ‌ళ్లీ దానికి కంటున్యూటీగా హైద‌రాబాద్ లో షూటింగ్ చేసారు. తాజాగా మ‌రోసారి లంకకు బ‌య‌ల్దేర‌డం ఇంట్రెస్టింగ్. ఈ నేప‌థ్యంలో సినిమాలో శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచే అవ‌కాశం ఉంద‌ని తెల‌స్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్ష‌కుల్లోకి బ‌లంగా వెళ్లింది.

అక్క అన్నీ యాక్ష‌న్ స‌న్నివేశాలేనా:

మెగా అభిమానుల్లో `పెద్ది` గురించే డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. మ‌రి శ్రీలంక షెడ్యూల్ లో జాన్వీక‌పూర్ జాయిన్ అవుతుందా? లేక చ‌ర‌ణ్ స‌హా ఇత‌ర పాత్ర‌లపైనే స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారా? అన్న‌ది చూడాలి. అలాగే ఇవి శ్రీలంక స‌న్నివేశాల‌న్ని యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయ‌నే ప్ర‌చారం తొలి నుంచి జ‌రుగుతోంది. కానీ దీనిపై మేక‌ర్స్ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్-ఐవీవై ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్త‌గా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.