Begin typing your search above and press return to search.

'పెద్ది' డేట్ మిస్సయితే.. ప్లాన్ ఏంటీ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లైనప్ లో 'పెద్ది' సినిమాపై ఉన్న అంచనాలు మామూలుగా లేవు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే ఒక వైబ్ క్రియేట్ చేసింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Dec 2025 6:00 PM IST
పెద్ది డేట్ మిస్సయితే.. ప్లాన్ ఏంటీ?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లైనప్ లో 'పెద్ది' సినిమాపై ఉన్న అంచనాలు మామూలుగా లేవు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే ఒక వైబ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇది చరణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక పక్కా రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ప్రతీ చిన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఈ సినిమాను 2026 మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ఆ డేట్ చరణ్ పుట్టినరోజు కావడంతో, ఆరోజున సినిమా రిలీజ్ అయితే పండగలా ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఉన్నారు. దానికి తగ్గట్టే షూటింగ్ ప్లానింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న ఇండస్ట్రీ బజ్ ప్రకారం సినిమా రిలీజ్ విషయంలో చిన్న మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది.

అనుకున్న టైమ్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవచ్చని, లేదా అవుట్ పుట్ ను మరింత పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దే క్రమంలో రిలీజ్ డేట్ మారవచ్చని టాక్ నడుస్తోంది. మార్చిలో అనుకున్న డేట్ కు రావడం కొంచెం కష్టమే అనే మాట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే, ఫ్యాన్స్ కు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినా, సినిమా మంచి కోసం తప్పదు.

ఇక్కడే ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మార్చి 27 డేట్ ను మిస్ అయితే, మేకర్స్ మరో పవర్ ఫుల్ డేట్ ను పరిశీలిస్తున్నారట. అదే మే 1వ తేదీ. సమ్మర్ సీజన్ పీక్ లో ఉంటుంది కాబట్టి, ఆ డేట్ అయితే సినిమాకు లాంగ్ రన్ లో ప్లస్ అవుతుందని టీమ్ ఆలోచిస్తోందట. పైగా మే 1న లేబర్ డే హాలిడే కూడా కలిసి వస్తుంది. మార్చి మిస్ అయినా సమ్మర్ రేసులో మాత్రం గట్టిగా నిలబడాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మే 1కి వెళ్తే 'పెద్ది'కి ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా ఉంది. మార్చిలో యష్ 'టాక్సిక్' లాంటి భారీ సినిమాల పోటీ ఉంది. అదే మే నెలలో వస్తే సోలో రిలీజ్ దొరికే ఛాన్స్ ఎక్కువ. సమ్మర్ హాలిడేస్ ఎలాగూ ఉంటాయి కాబట్టి కలెక్షన్ల వర్షం కురిపించవచ్చు. రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో పక్కా విలేజ్ మాస్ సినిమా కాబట్టి, సమ్మర్ ఆడియెన్స్ కు ఇది ఫుల్ మీల్స్ లాంటిదే. అందుకే ఈ కొత్త డేట్ ప్రపోజల్ పై మేకర్స్ సీరియస్ గానే చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికైతే ఇది కేవలం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.