Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ను ప‌ట్టుకున్న కొత్త భ‌యం

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 Sept 2025 1:00 AM IST
చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ను ప‌ట్టుకున్న కొత్త భ‌యం
X

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్, ఆ త‌ర్వాత వ‌చ్చిన గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో డిజాస్ట‌ర్ ను అందుకోవ‌డంతో త‌మ ఆశ‌లన్నింటినీ త‌ర్వాత‌ రాబోతున్న పెద్ది సినిమాపైనే పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

పెద్ది కోసం భారీ షెడ్యూల్

జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను బుచ్చిబాబు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కాస్టింగ్ నుంచి క్రూ వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క అంశంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ వ‌స్తున్న బుచ్చిబాబు, ఈ సినిమా షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసిన బుచ్చి, పెద్ది కోసం ఇప్పుడు మ‌రో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

డ్యూయెల్ రోల్ లో చ‌ర‌ణ్

పెద్ది షెడ్యూల్స్ అన్నింటిలో ఇదే లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తుండ‌గా, ఇందులో చ‌ర‌ణ్ పై యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటూ ఓ పాట‌ను కూడా తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. కాగా పెద్ది సినిమాలో చ‌ర‌ణ్ డ్యూయెల్ రోల్ లో న‌టిస్తున్నార‌ని, ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే చ‌ర‌ణ్ సెకండ్ క్యారెక్ట‌ర్ తాలూకా సీన్స్ ను బుచ్చిబాబు ఈ షెడ్యూల్ లో షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు బుచ్చిబాబు అభ‌యం

ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజ‌ర్ లో డ్యూయెల్ రోల్ చేయ‌గా, ఆ సినిమాలో కూడా రెండో పాత్ర ఫ్లాష్ బ్యాక్ లోనే వ‌స్తుంది. ఇప్పుడు పెద్ది లో కూడా రామ్ చ‌ర‌ణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నార‌ని, ఫ్లాష్ బ్యాక్ లో సెకండ్ క్యారెక్ట‌ర్ వ‌స్తుంద‌ని చెప్తుండ‌టంతో గేమ్ ఛేంజ‌ర్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందేమోన‌ని ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నారు. గేమ్ ఛేంజ‌ర్ కాకుండా గ‌తంలో కూడా చ‌ర‌ణ్ డ్యూయెల్ రోల్ లో సినిమాలు చేసినా ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజ‌ర్ ను దృష్టిలో పెట్టుకునే పెద్ది విష‌యంలో భ‌య‌ప‌డుతున్నారు. కానీ పెద్ది మాత్రం చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు అలాంటి భయాలు అక్క‌ర్లేద‌ని, పెద్ది మూవీ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంద‌ని హామీ ఇస్తున్నారు. చూడాలి మ‌రి బుచ్చిబాబు చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ను ఏం చేస్తారో. వ‌చ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్న పెద్ది సినిమాలో క‌న్న‌డ స్టార్ శివ రాజ్‌కుమార్, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా, ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.