Begin typing your search above and press return to search.

బుచ్చిబాబుని డిసైడ్ చేసేది అప్పుడే!

బుచ్చి బాబు సానా రెండ‌వ సినిమా ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో `పెద్ది` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   15 Nov 2025 11:00 PM IST
బుచ్చిబాబుని డిసైడ్ చేసేది అప్పుడే!
X

బుచ్చి బాబు సానా రెండ‌వ సినిమా ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో `పెద్ది` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఉప్పెన‌` స‌హా `పెద్ది` క‌థ న‌చ్చ‌డంతో చ‌ర‌ణ్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇచ్చాడు. ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా అను భ‌వం లేక‌పోయినా? ప్ర‌తిభావంతుడిగా చ‌ర‌ణ్ గుర్తించ‌డంతో ఛాన్స్ సాధ్యమైంది. ఇక `పెద్ది`పై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌క్కా మాస్ కంటెంట్ తో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్లు..తొలి లిరిక‌ల్ సాంగ్ తో అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి.

బుచ్చిబాబు ప్లాన్ బీ:

భారీ ఎత్తున బిజినెస్ జ‌రిగే చిత్ర‌మిది. అయితే ఈ సినిమా స‌క్సెస్ అన్న‌ది బుచ్చిబాబు కెరీర్ కు అత్యంత కీల‌క మైంది. ఈ సినిమా గున‌క భారీ విజ‌యం సాధిస్తే స్టార్ హీరోలే బుచ్చిబాబు కోసం క్యూలో ఉంటారు. చ‌ర‌ణ్ త‌ర్వాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తాన‌ని బుచ్చిబాబు ఓపెన్ అయిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి రెండ‌వ ప్రాజెక్ట్ తార‌క్ తోనే ఉండాలి. కానీ అనివార్య కార‌ణాల‌తో అది సాధ్యం కాని నేప‌థ్యంలో త‌దుప‌రి చిత్రం మాత్రం తార‌క్ తోనేని ముందే చెప్పాడు బుచ్చిబాబు. అలాగే ఈ న‌యా డైరెక్ట‌ర్ ప్లాన్ బీ గా బాలీవుడ్ ని కూడా లైన్ లో పెట్టిన‌ట్లు వినిపిస్తోంది.

షారుక్ తో ఛాన్స్ ఈజీనా:

షారుక్ ఖాన్ తో సినిమా చేసే ప్లాన్ లోఉన్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. షారుక్ ని బుచ్చిబాబు క‌ల‌వ‌డం...స్టోరీ లైన్ విష‌యంలో ఆయ‌నా పాజిటివ్ గా స్పందించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ షారుక్ తో సినిమా అంత వీజీ కాదు. అత‌డితో సినిమా అంటే బుచ్చిబాబు అద్భుతం చేయాలి. అదీ ఉన్న ప‌ళంగా సినిమా చేయాలంటే లైన్ లో ఉన్న `పెద్ది` బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాలి. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు సాధించాలి. అప్పుడే షారుక్ ఛాన్స్ ఇవ్వ‌డానికి అవకాశాలు ఉంటాయి. అయితే బుచ్చిబాబుకున్న అడ్వాటేంజ్ఏంటంటే? క‌థ‌ని క‌మ‌ర్శియ‌లైజ్ చేయ‌డంలో దిట్ట‌.

టాలీవుడ్ పై బాలీవుడ్ మోజు:

బుచ్చిబాబు కూడా అట్లీ త‌ర‌హా ఫార్ములాను అనుస‌రిస్తుంటాడు. అట్లీకి ఆకోణంలోనే `జ‌వాన్ `ని డైరెక్ట్ చేసే అవ‌కాశం షారుక్ ఖాన్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో `పెద్ది` స‌క్సెస్ క‌థ స‌హా అన్న‌ది బుచ్చిబాబుకు అత్యంత కీల‌క‌మైంది. అలాగే బాలీవుడ్ స్టార్లు అంతా కూడా టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌తో ప‌నిచేయాలి? అన్న ఆస‌క్తితో ఉన్నారు. పాన్ ఇండియాలో ఇమేజ్ సాధ్య‌మ‌వ్వాలంటే? అదీ టాలీవుడ్ ప్ర‌తిభావంతుడితోనే సాధ్య‌మ‌ని న‌మ్ముతోన్న స‌మ‌యం ఇది. అదీ కూడా కొంత వ‌ర‌కూ బుచ్చిబాబుకు షారుక్ విష‌యంలో కలిసొస్తుంద‌ని చెప్పొచ్చు.