పెద్ది సెకండ్ హాఫ్ కి షిఫ్ట్..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ షాట్ తోనే సెన్సేషన్ అనిపించాడు. సినిమాలో మాస్ స్టఫ్ ఏ రేంజ్ లో ఉందో ఫ్యాన్స్ కి శాంపిల్ చూపిస్తూ వదిలిన పెద్ది గ్లింప్స్ అదిరిపోయింది
By: Ramesh Boddu | 24 Sept 2025 4:00 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ షాట్ తోనే సెన్సేషన్ అనిపించాడు. సినిమాలో మాస్ స్టఫ్ ఏ రేంజ్ లో ఉందో ఫ్యాన్స్ కి శాంపిల్ చూపిస్తూ వదిలిన పెద్ది గ్లింప్స్ అదిరిపోయింది. ఐతే ఆ తర్వాత సినిమా నుంచి మరో అప్డేట్ రాలేదు. దసరాకి మళ్లీ ఒక సాంగ్ లేదా పోస్టర్ ఏదైనా వదిలే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. పెద్ది సినిమా విషయంలో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.
రెండో సినిమానే గ్లోబల్ స్టార్ తో..
బుచ్చి బాబు ఉప్పెన తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అది కూడా రెండో సినిమానే గ్లోబల్ స్టార్ తో తీయడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. వాటికి తగినట్టుగానే బుచ్చి బాబు పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
పెద్ది సినిమాను 2026 మార్చి 28న రిలీజ్ అనుకున్నారు. ఐతే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం కదా అని ఆ డేట్ కోసం స్పీడ్ గా కాకుండా అనుకున్న విధంగా అవుట్ పుట్ వచ్చిందని సాటిస్ఫై అయిన తర్వాతే సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఫిల్మ్ నగర్ సర్కిల్ ఇన్ ఫర్మేషన్ ప్రకారం పెద్దిని 2026 ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ రిలీజ్ చేస్తే బెటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారట.
విశ్వంభర సమ్మర్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సమ్మర్ రిలీజ్ ఉంది. అందుకే సమ్మర్ లో పెద్ది వస్తే మళ్లీ క్లాష్ అవుతుందని భావించి ఆ సినిమాను 2026 సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ చేస్తున్నారట. ఓ విధంగా ఇది మంచి నిర్ణయమే అని చెప్పొచ్చు. ఐతే పెద్ది ఎప్పుడు వచ్చినా టార్గెట్ కచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జతగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
RRR తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. అందుకే పెద్దితో పవర్ ఫుల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు చరణ్. బుచ్చి బాబు పెద్ది ప్రతి విషయంలో చాలా ఫోకస్ గా ఉంటున్నాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సినిమాలో ఆయన రోల్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. పెద్ది అనుకున్న విధంగా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో బుచ్చి బాబు కూడా చేరినట్టే అవుతుంది.
