పెద్ది.. 40 ఏళ్ల నాటి విజయనగరం
అప్పటి మనుషుల జీవనశైలి, వాళ్ళ కట్టుబొట్టు, చుట్టూ ఉండే కొండలు ఇలా ప్రతిదీ చాలా ఆర్గానిక్ గా చూపించే ప్రయత్నం జరిగిందట.
By: M Prashanth | 27 May 2026 10:15 AM ISTజూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న 'పెద్ది' సినిమాలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సూటిగా చెప్పారు. ఈ సినిమా కోసం ఏకంగా 40 ఏళ్ల క్రితం నాటి విజయనగరం వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లు వెల్లడించారు. కేవలం సెట్స్ వేయడమే కాకుండా ఆ కాలం నాటి ఎమోషనల్ ఫీల్ ను స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా తీసుకురావడానికి టీమ్ అంతా చాలా గట్టిగా వర్క్ చేసిందట.
సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు నిజంగానే ఒక పాత ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందని కెమెరామెన్ నమ్మకంగా చెబుతున్నారు. ముఖ్యంగా విజయనగరం క్లాక్ టవర్, అప్పటి వీధులు, పాత షుగర్ ఫ్యాక్టరీ లాంటివి చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. స్క్రిప్ట్ లో ఉన్న ఆ సోల్ మిస్ అవ్వకుండా ప్రతి చిన్న ఎలిమెంట్ ను రియాలిటీకి దగ్గరగా నిర్మించారని తెలిపారు.
అప్పటి మనుషుల జీవనశైలి, వాళ్ళ కట్టుబొట్టు, చుట్టూ ఉండే కొండలు ఇలా ప్రతిదీ చాలా ఆర్గానిక్ గా చూపించే ప్రయత్నం జరిగిందట. మొదటి ఫ్రేమ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు ఒకే రకమైన మూడ్ క్యారీ అయ్యేలా కెమెరా వర్క్ సెట్ చేశారు. దీనివల్ల ప్రేక్షకులు ఎక్కడా స్టోరీ ట్రాక్ నుంచి బయటకు రాకుండా ఆ ప్రపంచంలోనే ఉండిపోతారట.
డైరెక్టర్ బుచ్చిబాబు సన రాసుకున్న ఈ రా అండ్ రస్టిక్ స్టోరీకి ఇలాంటి బ్యాక్ డ్రాప్ ప్రాణం పోస్తుందనే చెప్పాలి. రామ్ చరణ్ కుస్తీ ఫైటర్ గా నటిస్తున్న ఈ క్రీడా నేపథ్యంలో.. 1980ల నాటి వాతావరణం కథకు మరింత బలాన్ని ఇస్తుంది. అప్పటి మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధాలు, క్రీడాకారుల కష్టాలు ఈ సెటప్ లో నాచురల్ గా పండుతాయని దర్శకుడు కూడా నమ్మకం కలిగిస్తున్నాడు.
పల్లెటూరి కథలు అంటే ఏదో ఒక ఊరిలో షూటింగ్ చేసి ముగించేస్తారు. కానీ ఇలా నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లి ఒక కంప్లీట్ సిటీని, పాత ఫ్యాక్టరీలను రీక్రియేట్ చేయడం టెక్నికల్ గా మామూలు టాస్క్ కాదు. అందులోనూ రత్నవేలు లాంటి అనుభవం ఉన్న టెక్నీషియన్ ఈ ప్రాజెక్ట్ కు పనిచేయడం విజువల్ గా ఈ సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసింది.
ఇప్పటికే ఢిల్లీ ఎపిసోడ్ గురించి అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి, ఇప్పుడు ఈ పాత విజయనగరం సెటప్ గురించి వస్తున్న డీటెయిల్స్ సినిమా మీద ఆసక్తిని డబుల్ చేస్తున్నాయి. కేవలం హీరో ఇమేజ్ మీదే కాకుండా పక్కా వరల్డ్ బిల్డింగ్ తో వస్తున్న ఈ కంటెంట్ ఆడియన్స్ కు కొత్త కిక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ పెద్ది పాత ప్రపంచం తెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతోందో చూడాలి.
