Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో నో పెద్ది ఈవెంట్?

పెద్ది సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా ప్ర‌మోష‌న్లు స‌రిగా లేవ‌ని రెండు వారాల ముందు వ‌ర‌కు మెగా అభిమానులు చాలా ఫీల‌వుతూ ఉండేవాళ్లు.

By:  Garuda Media   |   30 May 2026 5:06 PM IST
హైద‌రాబాద్‌లో నో పెద్ది ఈవెంట్?
X

పెద్ది సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా ప్ర‌మోష‌న్లు స‌రిగా లేవ‌ని రెండు వారాల ముందు వ‌ర‌కు మెగా అభిమానులు చాలా ఫీల‌వుతూ ఉండేవాళ్లు. కానీ ముంబ‌యిలో ట్రైల‌ర్ లాంచ్ ద‌గ్గ‌ర్నుంచి టీం ప్ర‌మోష‌న్ల‌ను హోరెత్తించేస్తోంది. త‌ర్వాత భోపాల్‌లో ఒక భారీ ఈవెంట్ చేశారు. బెంగ‌ళూరు, ఢిల్లీల్లోనూ ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. టీంలో ముఖ్యులంద‌రూ మీడియాను క‌లిసి ఇంట‌ర్వ్యూలిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, జాన్వి క‌పూర్‌ల ఇంట‌ర్వ్యూలు కూడా మొద‌ల‌య్యాయి. చెన్నైలోనూ ఈ రోజు ఒక ప్రెస్ మీట్ చేసారు . ఇలా దేశ‌మంతా తిరిగి.. తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్ట‌బోతోంది పెద్ది టీం. ఏపీ ప్రేక్ష‌కుల కోసం విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో జూన్ 1న ప్రి రిలీజ్ ఈవెంట్ చేయ‌బోతున్నారు. దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

ఐతే దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈవెంట్లు చేస్తున్న పెద్ది టీం.. హైద‌రాబాద్‌లో మాత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ చేయ‌డం క‌ష్ట‌మే అని అంటున్నారు. సాధార‌ణంగా తెలుగులో ప్రతి పెద్ద సినిమాకూ హైద‌రాబాద్‌లోనే ప్రి రిలీజ్ ఈవెంట్ చేస్తారు. కానీ పెద్దికి ఇక్క‌డ ఈవెంట్ డౌటే అంటున్నారు. జూన్ 1న విజ‌య‌వాడ‌లో ఈవెంట్ చేశాక హైదరాబాద్‌లో అంత పెద్ద కార్య‌క్ర‌మం చేయ‌డానికి టైం ఉండ‌దు. ఎందుకంటే 3నే ఈ సినిమాకు ప్రిమియ‌ర్స్ ప్లాన్ చేస్త‌న్నారు. 1న విజ‌య‌వాడ‌లో ఈవెంట్ చేసుకుని వ‌చ్చి త‌ర్వాతి రోజే పెద్ద ఈవెంట్ అంటే సాధ్యం కాదు. ఐతే సినిమాకు తెలుగులో కావాల్సినంత హైప్ ఉన్న నేప‌థ్యంలో మ‌ళ్లీ హైద‌రాబాద్‌లో ఈవెంట్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌నే భావిస్తున్నార‌ట‌. ఇక్క‌డ 2న లేదా 3న‌ ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ పెట్టి అంత‌టితో ప్ర‌మోష‌న్ల‌కు తెర‌దించుతార‌ట‌. ఇక తెలుగు మీడియాతో ఇంట‌ర్వ్యూలు కూడా రిలీజ్‌కు ముందు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. విడుద‌ల త‌ర్వాత ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, జాన్వి మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ట‌.