Begin typing your search above and press return to search.

ఒక్క లుక్ తో భారీ హైప్.. 'రంగస్థలం'కు మించి ఉంటుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన డెడికేషన్‌ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

By:  M Prashanth   |   28 March 2026 12:46 PM IST
ఒక్క లుక్ తో భారీ హైప్.. రంగస్థలంకు మించి ఉంటుందా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన డెడికేషన్‌ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తన తాజా చిత్రం పెద్ది కోసం ఆయన చేసిన పహిల్వాన్ మేకోవర్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. స్ట్రాంగ్ ఫిజిక్, సీరియస్ అండ్ రా అండ్ ఎర్తీ లుక్‌ తో చరణ్ నిజమైన కుస్తీ వీరుడిలా కనిపిస్తున్నారు. ఆ కొత్త అవతార్ సినిమా మీద అంచనాలను మరింత పెంచుతోంది.




ఆ పాత్ర కోసం చరణ్ కంప్లీట్ మేకోవర్ చేసుకున్నారని తాజా లుక్ చూస్తేనే అర్థమవుతోంది. కేవలం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాకుండా.. పాత్రకు అవసరమైన ఎమోషన్స్ ను సరైన విధంగా చూపించేందుకు చాలా కష్టపడినట్లు క్లియర్ గా తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తోపాటు కూడిన ఈ రస్టిక్ మాస్ క్యారెక్టర్‌ లో చరణ్ పూర్తి స్థాయిలో లీనమై నటిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.




పెద్ది సినిమా టోన్ పూర్తిగా రూటెడ్‌ గా, నేచురాలిటీకి దగ్గరగా ఉండనుందని మేకోవర్ ద్వారా అర్థమవుతోంది. పహిల్వాన్‌ గా కనిపించేందుకు చరణ్ చేసిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌ లోనూ కనిపించబోతోందని చిత్రబృందం చెబుతోంది. బలం, పట్టుదల, ధైర్యం వంటి లక్షణాలను ఆ పాత్ర ద్వారా చూపించబోతున్నారని సమాచారం. ఇటీవలి కాలంలో పాత్ర కోసం తన లుక్‌ ను పూర్తిగా మార్చుకునే విషయంలో చరణ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

రంగస్థలంలో చెర్రీ చూపించిన నటన ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో, ఇప్పుడు పెద్దిలో కూడా అంతకుమించి మరో పవర్‌ ఫుల్ పాత్రతో మెప్పించబోతున్నారని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కంటెంట్‌ కు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో, చరణ్ ఇలాంటి బలమైన కథలు, పాత్రలు ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది.

కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఇచ్చే కథలో నటించడం ద్వారా ఆయన మరోసారి తన యాక్టింగ్ స్టామినాను నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన లుక్ వైరల్ అవుతోంది. అభిమానులు చరణ్ కొత్త అవతార్ ను చూసి ఫిదా అవుతున్నారు. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంటెన్స్ లుక్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

చాలా మంది ఇది చరణ్ కెరీర్‌ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పెద్దిలో రామ్ చరణ్ పహిల్వాన్ మేకోవర్ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసింది. ఆ లుక్ చూస్తుంటే, ప్రేక్షకులకు థియేటర్లలో ఓ పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. మరి అభిమానుల అంచనాలను అందుకుంటూ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందా అన్నది చూడాలి.