పెద్ది నైజాం రైట్స్ సెన్సేషన్.. రెండు డిజాస్టర్ల తర్వాత కూడా అదే స్టామినాతో చరణ్!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, పెద్ది సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా రూ.63 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 16 May 2026 10:46 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ప్రారంభించింది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నైజాం హక్కులకు సంబంధించిన సమాచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, పెద్ది సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా రూ.63 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ఇందులో రూ.5 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్‌గా ఉండటం విశేషం. అంటే సినిమా అంచనాలకు తగ్గట్టు వర్కవుట్ కాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో సీడెడ్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఒకే ప్రాంతానికి ఇంత భారీ బిజినెస్ జరగడం చూసి ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు సినీ చరిత్రలో నైజాం మార్కెట్ ఎప్పటినుంచో అత్యంత కీలకంగా భావించబడుతుంది. అలాంటి ఏరియాలో పెద్ది రూ.63 కోట్ల బిజినెస్ చేయడం చిన్న విషయం కాదు. అది కూడా ఎలాంటి సీక్వెల్ సినిమా కాకపోవడం, ఫ్రాంచైజ్ బ్యాక్‌డ్రాప్ లేకపోవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు నైజాం రికార్డుల్లో పుష్ప2 రూ.100 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆర్ఆర్ఆర్ రూ.70 కోట్లు, కల్కి 2898AD రూ.65 కోట్లు, పెద్ది రూ.63 కోట్లు, సలార్ రూ.60 కోట్లతో కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లిస్ట్ లో పెద్ది స్థానం దక్కించుకోవడం రామ్ చరణ్ స్టార్‌డమ్‌కు మరో నిదర్శనంగా భావిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, పెద్ది ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం చూసి చరణ్ మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పెద్దిపై ఇంత భారీ బిజినెస్ జరగడానికి ప్రధాన కారణం రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజ్ అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌కు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పెరిగింది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలు వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారని సమాచారం. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన్న రా అండ్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది రూపొందడటంతో మాస్ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. రిలీజ్‌కు ముందే ఈ స్థాయి బిజినెస్ జరుగుతుండటంతో పెద్ది బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
