Begin typing your search above and press return to search.

మృణాల్ మెగా సర్ప్రైజ్.. క్లిక్కయితే అరాచకమే..

ఇలాంటి హైప్ మధ్య మృణాల్ స్పెషల్ సాంగ్ వార్త మరిన్ని అంచనాలు పెంచుతోంది.

By:  M Prashanth   |   23 Jan 2026 6:57 PM IST
మృణాల్ మెగా సర్ప్రైజ్.. క్లిక్కయితే అరాచకమే..
X

మెగా అభిమానులకు మరోసారి భారీ సర్ప్రైజ్ ఇచ్చే వార్త టాలీవుడ్‌ లో చక్కర్లు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో పెద్ది మూవీ రూపొందుతుండగా.. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. కథాపరమైన పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ లో మెప్పిస్తున్న మృణాల్, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న టాక్ రావడంతో.. అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే పెద్దిలో స్పెషల్ సాంగ్ కీలకమైన సందర్భంలో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

గ్రామీణ నేపథ్యంలో సాగే పెద్ది మూవీ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రామ్ చరణ్ పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది. జాన్వీ- చరణ్ జోడీ తొలిసారి తెరపై కనిపించబోతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇలాంటి హైప్ మధ్య మృణాల్ స్పెషల్ సాంగ్ వార్త మరిన్ని అంచనాలు పెంచుతోంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాస్ బీట్‌ తో ప్రత్యేకంగా సాంగ్ రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రెహమాన్ క్లాసికల్, మెలోడీ టచ్ ఉన్న పాటలకే ఎక్కువ పేరు ఉన్నా, ఈసారి ఫుల్ మాస్ టెంపోతో సాంగ్ కంపోజ్ చేశారట. ఆ పాటను మేకర్స్ గ్రాండ్‌ గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

భారీ సెట్లు, పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లతో స్పెషల్ సాంగ్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ గా నిలవనుందని టాక్. అయితే స్పెషల్ సాంగ్ పై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మృణాల్ ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో, ఆమె స్పెషల్ సాంగ్‌ కు డేట్స్ ఇచ్చారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మాత్రం ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి భారీ బడ్జెట్ తో నిర్మాత సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్ది మూవీలో మృణాల్.. నిజంగా స్పెషల్ సాంగ్ చేస్తే హైలెట్ గా నిలవనుంది. డ్యాన్స్ తో ఎప్పుడూ అదరగొట్టే చరణ్.. సరసన మృణాల్ మాస్ స్టెప్పులు వేస్తే అభిమానులకు పండగే. సాంగ్ కూడా క్లిక్ అవ్వడం ఖాయం. ఏదేమైనా మెగా హీరో సినిమా.. రెహమాన్ మాస్ బీట్.. మృణాల్ గ్లామర్.. ఆ కాంబినేషన్ తెరపై ఎంత అరాచకం సృష్టిస్తుందో చూడాల్సిందే.