Begin typing your search above and press return to search.

'పెద్ది' బాక్సాఫీస్.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రం థియేట్రికల్ హక్కులు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.220 కోట్ల మేర అమ్ముడైనట్లు ఇప్పటికే టాక్ వినిపించింది.

By:  M Prashanth   |   7 Jun 2026 12:53 PM IST
పెద్ది బాక్సాఫీస్.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ చిత్రం పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లో ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.236.7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ను మిక్స్ చేసి తెరకెక్కించిన ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు సానా మేకింగ్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీనికితోడు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం కలెక్షన్ల రోజురోజుకూ పెరుగుతున్నాయి.

సినిమా విడుదలైన తొలి రోజు భారీ ఓపెనింగ్స్ నమోదు చేసింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగగా, మూడో రోజు అయిన శనివారం వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కలెక్షన్లను వెల్లడిస్తూ మూవీ టీమ్ ప్రత్యేక పోస్టర్‌ ను విడుదల చేసింది. బాక్సాఫీస్ ఛాంపియన్ పెద్ది ఈజ్ అన్‌ స్టాపబుల్ అంటూ రిలీజ్ చేసి అభిమానుల్లో మరింత జోష్ నింపింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ది చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. పలు ప్రాంతాల్లో థియేటర్లు హౌస్‌ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడం, అక్కడి కల్చర్, లైఫ్ స్టైల్ ను స్క్రీన్ పై చూపించడం ప్రేక్షకులకు దగ్గరగా అనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా పెద్ది మంచి వసూళ్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం.

అమెరికా సహా పలు దేశాల్లో తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో సినిమా సాలిడ్ గా రాణిస్తోంది. ఇక మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై కూడా చర్చ జరుగుతోంది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రం థియేట్రికల్ హక్కులు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.220 కోట్ల మేర అమ్ముడైనట్లు ఇప్పటికే టాక్ వినిపించింది.

దీంతో సినిమా లాభాల బాట పట్టాలంటే సినిమా మరిన్ని వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే తొలి మూడు రోజుల్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే మూవీ టీమ్ లో పూర్తి నమ్మకం కనిపిస్తోంది. ఇప్పుడు నాలుగో రోజు ఆదివారం కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా పెద్ది మూవీ విడుదలైన మూడు రోజుల్లో భారీ వసూళ్లు నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇక వర్కింగ్ డేస్‌ లో కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తే.. త్వరలోనే ప్రాఫిట్ జోన్‌ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.