హిట్ మూవీపైనే చిన్న క్రిటిక్… బాండింగ్ పెరిగి ఉంటే రేంజ్ ఇంకో లెవల్!
పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవుతూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
By: Madhu Reddy | 12 Jun 2026 8:00 AM ISTపెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవుతూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు జగపతి బాబు, ఒక ఆర్టిస్ట్‌గా సినిమాపై తనకున్న ప్రేమతో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే, కొన్ని రూమర్లపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జగపతి బాబు ,బుచ్చిబాబు కలిసి ఓ చిట్ చాట్ నిర్వహించారు అందులో ఆయన మూవీ గురించి చేసిన విశేషాలు చూద్దాం..
బాండింగ్ పెరిగి ఉంటే రేంజ్ ఇంకో లెవల్:
సినిమా కథా గమనంపై జగపతి బాబు ఒక చిన్న క్రిటిక్ ను పంచుకున్నారు. "కథ పరంగా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కానీ నా మనసుకు అనిపించింది ఏంటంటే.. పెద్ది పాత్రకు, అప్పలసూరి పాత్రకు మధ్య ఇంకొంచెం బాండింగ్, ఎక్కువ సీన్లు ఉండి ఉంటే సినిమా రేంజ్ ఇంకో లెవల్‌లో ఉండేదేమో. 35 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న నన్ను, చరణ్ లాంటి అంత పెద్ద స్టార్ స్క్రీన్ మీద 'ఒరేయ్ అరేయ్' అనుకుంటూ, తోసేస్తూ, ముచ్చట్లాడుకుంటూ ఉంటే చూసేందుకు చాలా ముద్దుగా ఉండేది. ఇక ఆ బాండింగ్ ఎలిమెంట్స్ ఇంకాస్త పెంచే అవకాశం ఉండి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్" అని ఆయన మనసులో మాటను డైరెక్టర్ బుచ్చి తో పంచుకున్నారు..
‘75 టేక్స్ తీసుకున్నానా?’… రూమర్స్‌పై జగపతి బాబు క్వశ్చన్:
ఇక సినిమా షూటింగ్ సమయంలో జగపతి బాబు ఒక సీన్ కోసం ఏకంగా 75 టేక్స్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వచ్చాయి. దీనిపై జగపతి బాబు నవ్వుతూ డైరెక్టర్ ను అడిగారు ఇది నిజామా? అని అందుకు బుచ్చి బాబు అంతా అబద్దం అని తెలిపాడు..ఇక జగపతి బాబు మాట్లాడుతూ.. "నేను అప్పలసూరి పాత్ర కోసం 75 టేక్స్ తీసుకున్నానని ఎవరో రాశారు. అస్సలు అంత సీన్ లేదు! నేనెప్పుడూ ఒకటి లేదా రెండు టేకుల్లోనే సీన్ ఓకే చేస్తాను, మహా అయితే మూడో టేక్. బుచ్చిబాబు నా లుక్ చూపించిన రోజే నేను అప్పలసూరి పాత్రలోకి వెళ్ళిపోయాను. సెట్స్‌లోకి వెళ్ళినప్పుడు నేను యాక్ట్ చేయలేదు, అప్పలసూరిలా బిహేవ్ చేశాను అంతే. ఇక డబ్బింగ్ మాత్రం చాలా పెయిన్‌ఫుల్‌గా, ప్రాణం పెట్టి చెప్పాల్సి వచ్చింది. అంతేకానీ 75 టేక్స్ అనేవి కేవలం అబద్ధపు ప్రచారాలు మాత్రమే" అని క్లారిటీ గా చెప్పాడు..
‘తెలుగు వాడినే కాబట్టి?’… అప్పలసూరిపై గుర్తింపు చర్చ:
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అప్పలసూరి పాత్రను మెచ్చుకుంటున్నా, ఆ పాత్రకు రావలసినంత క్రెడిట్ సోషల్ మీడియాలో రావడం లేదనే ఒక చిన్న అసంతృప్తిని జగపతి బాబు బయటపెట్టారు. "సినిమా చూసి ఒక పెద్ద డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు.. 'ఇదే క్యారెక్టర్ ఎవరైనా మలయాళం నటుడో, తమిళ్ నటుడో లేదా హిందీ నటుడో చేసి ఉంటే ఈపాటికి వాడిని ఎక్కడో కూర్చోబెట్టేవారు. మీరు తెలుగువాడు కావడం మీ బ్యాడ్ లక్, మనవాళ్లు మనవాళ్లను అంతగా లేపరు' అని ఆ డైరెక్టర్ అన్నారు. అది నిజమేనేమో అనిపిస్తుంది. అందరూ జగపతి బాబు బాగా చేశాడు అంటున్నారు తప్ప, 'అప్పలసూరి' అనే పాత్ర పేరును జనాలు ఎక్కువగా వాడటం లేదు" అంటూ తెలుగు పరిశ్రమలో గుర్తింపుపై ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు.
దర్శకుడు బుచ్చిబాబు సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను కూడా వదులుకోవడానికి సిద్ధపడటం అతని కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమని జగపతి బాబు కొనియాడారు. ఇక చిన్నచిన్న లోపాలు, ట్రైలర్ కట్ లో జరిగిన చిన్న పొరపాట్లు మినహాయిస్తే.. 'పెద్ది' ఒక అద్భుతమైన రూటెడ్ సినిమా అని, రూమర్లను దాటుకుని ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునేలా చేసిన హిట్ ఇదని జగపతి బాబు హర్షం వ్యక్తం చేశారు.
