Begin typing your search above and press return to search.

పెద్ది మొదలు పెట్టాడు.. ప్యారడైజ్ ఎక్కడ..?

స్టార్ సినిమాలు ఈమధ్య మొదలు పెట్టే టైం లోనే రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. అఫ్కోర్స్ అలా చెప్పిన డేట్ కి ఎన్ని సినిమాలు వస్తున్నాయి అన్నది చెప్పడం కష్టం అవుతుంది.

By:  Ramesh Boddu   |   10 Nov 2025 11:58 AM IST
పెద్ది మొదలు పెట్టాడు.. ప్యారడైజ్ ఎక్కడ..?
X

స్టార్ సినిమాలు ఈమధ్య మొదలు పెట్టే టైం లోనే రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. అఫ్కోర్స్ అలా చెప్పిన డేట్ కి ఎన్ని సినిమాలు వస్తున్నాయి అన్నది చెప్పడం కష్టం అవుతుంది. కానీ కొన్ని సినిమాలు రిలీజ్ టార్గెట్ తో కచ్చితమైన షెడ్యూల్స్ వేసుకుని వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలు ఒకే డేట్ ని రిలీజ్ లాక్ చేసుకున్నాయి. అందులో ఒకటి గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది ఉండగా రెండోది న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ ఉంది.

బుచ్చి బాబు డైరెక్షన్ లో పెద్ది..

ఈ రెండు సినిమాలు కూడా దేనికదే ప్రత్యేకంగా రాబోతున్నాయి. పెద్ది సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. పెద్ది నుంచి ఆలెడీ ఫస్ట్ షాట్ రాగా రెండో అప్డేట్ గా ఏకంగా వీడియో సాంగ్ తోనే సర్ ప్రైజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాను 2026 మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు. ఐతే అదే డేట్ న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న నాని ది ప్యారడైజ్ నుంచి మాత్రం ఇంకా అప్డేట్స్ రాలేదు. ది ప్యారడైజ్ ఎనౌన్స్ మెంట్ తోనే ఒక స్టేట్మెట్ రిలీజ్ చేశారు. అది వారెవా అనిపించగా నెక్స్ట్ నాని క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఒక టీజర్ వదిలారు. విలన్ గా మోహన్ బాబు టీజర్ ఒకటి వచ్చింది. ఐతే ప్యారడైజ్ హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నాని, శ్రీకాంత్ ఓదెల ఈసారి దసరా కాదు అంతకు మించి బ్లాస్ట్ చేసేలా ఉన్నారు.

నాని ది ప్యారడైజ్ అప్డేట్..

ఐతే పెద్ది నుంచి ఆల్రెడీ సాంగ్ వచ్చి సూపర్ హిట్ కాగా అదే రోజు రిలీజ్ అవబోతున్న నాని ది ప్యారడైజ్ అప్డేట్ లేట్ అవుతుంది. నాని సినిమాల ప్రమోషన్స్ లో కూడా తన ప్లానింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. మరి నాని అండ్ టీం ఎలా ప్లాన్ చేస్తున్నారో కానీ పోటీగా వస్తున్న పెద్ది దూకుడు పెంచాడు.. ది ప్యారడైజ్ కి సంబందించిన అప్డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి అది ఎలా చేస్తారన్నది చూడాలి.

చరణ్, నాని సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. ఐతే రెండు సినిమాలు బాగుంటే రెండు కూడా బ్లాక్ బస్టర్ చేయడంలో ఆడియన్స్ వెనకాడరని చెప్పొచ్చు. ఐతే పెద్ది సినిమా ముందే సాంగ్స్ తో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ నాని మార్చి నుంచి రిలీజ్ డేట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడా.. అందుకే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదా అన్న డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి.