Begin typing your search above and press return to search.

వాళ్ల టార్గెట్ తో పెద్ది.. ఏం చేస్తాడో..?

బుచ్చి బాబు డైరెక్షన్ లో రాం చరణ్ లీడ్ రోల్ లో వస్తున్న పెద్ది సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

By:  Ramesh Boddu   |   19 Jan 2026 12:51 PM IST
వాళ్ల టార్గెట్ తో పెద్ది.. ఏం చేస్తాడో..?
X

బుచ్చి బాబు డైరెక్షన్ లో రాం చరణ్ లీడ్ రోల్ లో వస్తున్న పెద్ది సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ తోనే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇక రెహమాన్ సంగీత సారధ్యంలో చికిరి పాటతోనే మూవీపై మరింత బజ్ పెరిగింది. చరణ్, జాన్వి జోడీ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంది. పెద్ది సినిమాలో చరణ్ మాస్ లుక్స్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఐతే ఇప్పటికే పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ లాక్ చేసుకుంది.

పాన్ ఇండియా లెవెల్ లో పెద్ది సంచలనంగా మారబోతుందనే హింట్స్ ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన కంటెంట్ తో వచ్చేశాయి. ఐతే పెద్ది రిలీజ్ కు 10 రోజుల ముందు భారీ సినిమాలు రెండు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఆల్రెడీ సెన్సేషనల్ హిట్ అయిన దురంధర్ సీక్వెల్ ఒకటి ఉండగా కె.జి.ఎఫ్ స్టార్ యష్ చేస్తున్న టాక్సిక్ సినిమా కూడా ఉంది.

దురంధర్ బ్లాక్ బస్టర్ కాబట్టి పార్ట్ 2 మీద కూడా నెక్స్ట్ లెవెల్..

రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన దురంధర్ సినిమా పార్ట్ 2 మార్చి 17న లాక్ చేశారు. ఈ సీక్వెల్ మీద బీ టౌన్ ఆడియన్స్ లో భారీ హైప్ ఉంది. దురంధర్ బ్లాక్ బస్టర్ కాబట్టి పార్ట్ 2 మీద కూడా నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. ఇక యష్ టాక్సిక్ కూడా జస్ట్ టీజర్ తోనే బ్లాస్ట్ అనిపించారు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ఎంత డ్యాషింగ్ గా తీస్తున్నారు అన్నది ఆ టీజర్ తోనే అర్ధమైంది.

ఐతే ఈ రెండు సినిమాలు పెద్ది రిలీజ్ కు వారం ముందే రావడం తో ఈ రెండిటిలో ఏ సినిమా అంచనాలను అందుకున్నా నెక్స్ట్ వీక్ వస్తున్న పెద్ది మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అందుకే బుచ్చి బాబు పెద్ది విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్లానింగ్ చేస్తున్నాడు. పెద్ది సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

పెద్ది తో పాటు నాని ది ప్యారడైజ్ సినిమా..

పెద్ది తో పాటు నాని ది ప్యారడైజ్ సినిమా కూడా మార్చి 26న రిలీజ్ అనుకున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు మార్చి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు సమ్మర్ కి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి పెద్ది సోలోగానే వస్తున్నా ముందు రిలీజ్ ప్లాన్ చేసిన యష్ టాక్సిక్, దురంధర్ 2 సినిమాలతో ఎలాంటి ఫైట్ అందిస్తుందో చూడాలి.

RRR తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు నిరాశపరిచాయి. అందుకే ఈసారి చరణ్ పెద్దితో బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నాడు. సినిమా ఎక్కడ కూడా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేయకుండా ఉండేలా బుచ్చి బాబు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.