Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: 2026 ఇండియా టాప్ 10లో తండ్రి కొడుకులు

2026 ఇంకా పూర్తికాలేదు. కానీ సెప్టెంబర్ మొదటి వారం వరకు వచ్చిన ఇండియా నెట్ కలెక్షన్స్ చూస్తే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ టాప్ 10లో ఉన్నారు.

By:  M Prashanth   |   2 Sept 2026 1:04 PM IST
బాక్సాఫీస్: 2026 ఇండియా టాప్ 10లో తండ్రి కొడుకులు
X

2026 ఇంకా పూర్తికాలేదు. కానీ సెప్టెంబర్ మొదటి వారం వరకు వచ్చిన ఇండియా నెట్ కలెక్షన్స్ చూస్తే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ టాప్ 10లో ఉన్నారు. తెలుగు నుంచి ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న సినిమాలు పెద్ది, మన శంకర వరప్రసాద్ గారు. రామ్ చరణ్ సినిమా నాలుగో స్థానంలో ఉంటే, చిరంజీవి సినిమా ఆరో స్థానంలో ఉంది. ఒకే ఏడాది తండ్రి, కొడుకు సినిమాలు ఇలా టాప్ 10లో కనిపించడం మెగా ఫ్యామిలీకి స్పెషల్ రికార్డ్ అనే చెప్పాలి.

‘పెద్ది’ ఇండియాలో రూ.244.64 కోట్ల నెట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ సోలో సినిమాలపై భారీ అంచనాలు వచ్చాయి. కానీ ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ‘పెద్ది’ మాత్రం రూ.200 కోట్ల ఇండియా నెట్ దాటి చరణ్‌కు మళ్లీ పెద్ద థియేట్రికల్ నెంబర్ ఇచ్చింది. ఇప్పటివరకు 2026లో ఇండియా నెట్ పరంగా తెలుగు సినిమాల్లో ఇదే ముందుంది.

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూ.218.47 కోట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. సీనియర్ హీరో సినిమాకు ఈ స్థాయి ఇండియా నెట్ రావడం చిన్న విషయం కాదు. పైగా ఇది పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. తెలుగులో మాత్రమే వచ్చింది. ఇక చరణ్ సినిమాకు రెండు స్థానాల వెనకే చిరు ఉండటం ఈ లిస్ట్‌లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఇక ఐదో స్థానంలో ఉన్న ‘టాక్సిక్’ ఉంది. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.అలాగే టాప్ 10లో హిందీ, హాలీవుడ్, తమిళం సినిమాలు కూడా ఉన్నాయి.

ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక నెట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఇవే..

1. దురంధర్ 2: రూ.1,149.30 కోట్లు

2. స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే: రూ.492.06 కోట్లు

3. బోర్డర్ 2: రూ.329.43 కోట్లు

4. పెద్ది: రూ.244.64 కోట్లు

5. టాక్సిక్: రూ.221.55 కోట్లు**

6. మన శంకర వరప్రసాద్ గారు: రూ.218.47 కోట్లు

7. జన నాయకన్: రూ.198.29 కోట్లు

8. కరుప్పు: రూ.198.18 కోట్లు

9. ది ఒడిస్సీ: రూ.189.93 కోట్లు

10. భూత్ బంగ్లా: రూ.182.36 కోట్లు

అయితే డిసెంబర్ వరకు ఇంకా చాలా పెద్ద సినిమాలు రావాల్సి ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ టాప్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది. రూ.200 కోట్ల మార్క్ దాటితే చిరు, చరణ్ స్థానాలు కూడా కిందకు వెళ్లొచ్చు. ప్రస్తుతం మాత్రం సెప్టెంబర్ మొదటి వరకు ఈ లెక్కల్లో ఇద్దరూ టాప్ 10లో ఉన్నారు. ఏడాది చివరికి కూడా ఇద్దరి పేర్లు అక్కడే ఉంటాయా లేదా అన్నది చూడాలి.