Begin typing your search above and press return to search.

పెద్ది కోసం చరణ్ ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలుసా? మేకర్స్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ వైరల్

ఆయన రీసెంట్ మూవీ పెద్ది కోసం ఎంతటి కమిట్‌మెంట్‌తో పనిచేశారో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం అభిమానులను కదిలిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 July 2026 1:26 PM IST
పెద్ది కోసం చరణ్ ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలుసా? మేకర్స్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ వైరల్
X

స్టార్ హీరోల సినిమాల వెనుక కనిపించేది గ్రాండ్ విజువల్స్, భారీ సెట్స్, అద్భుతమైన యాక్షన్ సీన్సే. కానీ ఆ అద్భుతాల వెనుక వారు ఎదుర్కొనే శారీరక ఒత్తిడి, గాయాలు, బాధలు ప్రేక్షకులకు చాలా అరుదుగానే తెలుస్తాయి. అలాంటి మరో ఉదాహరణగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన రీసెంట్ మూవీ పెద్ది కోసం ఎంతటి కమిట్‌మెంట్‌తో పనిచేశారో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం అభిమానులను కదిలిస్తోంది.




సాధారణంగా షూటింగ్ టైమ్ లో ఏదైనా గాయ‌మైతే నటులు కొంతకాలం రెస్ట్ తీసుకోవడం సహజం. కానీ రామ్ చరణ్ మాత్రం మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమాలోని కీలకమైన సీన్స్ షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు షూటింగ్‌ను ఆపకుండా కొనసాగించినట్లు మేకర్స్ వెల్లడించారు. నొప్పిని భరిస్తూనే తన బాధ్యతను పూర్తి చేయడం ఆయనకు వృత్తి పట్ల ఉన్న డెడికేష‌న్‌కి నిదర్శనంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మేక‌ర్స్ చెప్తున్న దాని ప్ర‌కారం, భారీ స్థాయిలో రూపొందిన పెద్ది సినిమాలో ప్రతి స‌న్నివేశానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో, షెడ్యూల్‌పై ప్రభావం పడకుండా చూసేందుకు చరణ్ తన వంతు కృషి చేసినట్లు అర్థ‌మ‌వుతుంది. ఒక సినిమా కోసం స్టార్ హీరోలు ఎంతటి ఫిజికల్, మెంటల్ ప్రెజర్‌ను ఎదుర్కొంటారో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

తాజాగా రామ్ చరణ్ మణికట్టుకు సంబంధించిన సర్జరీ స‌క్సెస్‌ఫుల్ గా పూర్తైన నేప‌థ్యంలో పెద్ది మూవీ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ఈ విష‌యాన్ని వెల్లడించింది. షూటింగ్ సమయంలో గాయపడినప్పటికీ నొప్పిని భరిస్తూ కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారని పేర్కొంటూ, ఆయన వృత్తి పట్ల చూపిన డెడికేష‌న్ నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. అలాగే చరణ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మొత్తం చిత్ర యూనిట్ ఆకాంక్షిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ కమిట్‌మెంట్‌ను ప్రశంసిస్తూ, త్వరగా కోలుకుని మళ్లీ ఆయ‌న సినిమా షూటింగుల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు. ఒక స్టార్‌గా మాత్రమే కాకుండా, తన పనిపట్ల నిబద్ధత కలిగిన హీరోగా రామ్ చరణ్ మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.