'పెద్ది' రిలీజ్ డేట్ మారిందా?.. అసలు విషయం ఇదే!
దీనికి తగ్గట్టే షూటింగ్ ప్లానింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతోంది. రేపటి నుంచే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకాబోతోంది.
By: M Prashanth | 11 Dec 2025 7:25 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయారు. గేమ్ ఛేంజర్ తర్వాత ఆయన ఫోకస్ మొత్తం 'పెద్ది' సినిమా మీదే ఉంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని, చరణ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఫస్ట్ సాంగ్ 'చికిరి చికిరి' కూడా జనాలకు బాగా నచ్చేసింది. దీంతో సినిమా మీద అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
అయితే గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని, అనుకున్న టైమ్ కు రావడం కష్టమని అంటున్నారు. మొదట ఈ సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ షూటింగ్ లేట్ అవుతుందని, అందుకే మే నెలకు వాయిదా వేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో పడ్డారు, అసలేం జరుగుతుందో అర్థంకాక టెన్షన్ పడ్డారు.
కానీ ఇప్పుడు ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ అసలు మేకర్స్ క్లారిటీతో విషయం బయటకు వచ్చింది. 'పెద్ది' సినిమా రిలీజ్ వాయిదా పడటం లేదట. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే మార్చి 27న సినిమాను థియేటర్లలోకి తేవడానికి టీమ్ ఫిక్స్ అయ్యింది. ఇందులో ఎలాంటి మార్పు లేదని, షూటింగ్ కూడా కరెక్ట్ టైమ్ కే పూర్తవుతుందని క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ నమ్మాల్సిన అవసరం లేదని మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చేశారు.
దీనికి తగ్గట్టే షూటింగ్ ప్లానింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతోంది. రేపటి నుంచే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకాబోతోంది. అక్కడ పని అవ్వగానే టీమ్ మొత్తం ఢిల్లీకి వెళ్తుంది. జనవరి చివరి కల్లా సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలనేది ప్లాన్. ఒకపక్క షూటింగ్ చేస్తూనే, మరోపక్క ఎడిటింగ్, డబ్బింగ్ పనులు కూడా కానిచ్చేస్తున్నారు. కాబట్టి సినిమా లేట్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదన్నమాట.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు లాంటి పెద్ద నటులు కూడా ఉన్నారు. వీటన్నింటికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. బుచ్చిబాబు కథ, చరణ్ యాక్టింగ్ కలిస్తే థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు రిలీజ్ డేట్ మీద కూడా క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక 'పెద్ది' గురించి వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఏ అడ్డంకులు లేకుండా చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27నే సినిమా రాబోతోంది. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
