Begin typing your search above and press return to search.

పెద్ది రికార్డుల వేట. 100 మిలియన్ల 'చికిరి'

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  M Prashanth   |   24 Nov 2025 2:39 PM IST
పెద్ది రికార్డుల వేట. 100 మిలియన్ల చికిరి
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమా ఇప్పటికే గ్లింప్స్ లోని ఆ క్రికెటింగ్ షాట్ తో అంచనాలను హై లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ మ్యూజికల్ గా కూడా విధ్వంసం మొదలైంది.





సాధారణంగా ఒక పాట హిట్ అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. కానీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్, రామ్ చరణ్ కలిస్తే రికార్డులు ఎలా బద్దలవుతాయో ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. ఫస్ట్ సింగిల్ తోనే యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్నారు. అభిమానులు రిపీట్ మోడ్ లో వింటూ వ్యూస్ వర్షం కురిపిస్తున్నారు.

'పెద్ది' సినిమాలోని ఫస్ట్ సింగిల్ "చికిరి చికిరి" అరుదైన రికార్డ్ ని దాటేసింది. కేవలం 12 రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల వ్యూస్ సాధించి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన పాటగా నిలిచింది. ఇందులో ఒక్క తెలుగు వెర్షనే దాదాపు 64 మిలియన్ల వ్యూస్ రాబట్టగా, సుమారు 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇక హిందీ వెర్షన్ కూడా 25 మిలియన్లకు పైగా వ్యూస్ తో నార్త్ లోనూ దుమ్మురేపుతోంది.

మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాటలో చరణ్ వేసిన స్టెప్పులు మెయిన్ హైలెట్ గా నిలిచాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ అందాన్ని పొగుడుతూ చరణ్ వేసిన మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. బుచ్చిబాబు విజువల్స్, వెంకట సతీష్ కిలారు నిర్మాణ విలువలు పాట స్థాయిని పెంచేశాయి. ఈ పాట ఇంత వేగంగా 100 మిలియన్ల క్లబ్ లో చేరుతుందని ఎవరు ఊహించలేదు.

మిగిలిన భాషల్లో కూడా ఈ పాట 10 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. మొత్తంగా చూస్తే 1.6 మిలియన్ల లైక్స్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మాస్ బీట్ కు క్లాస్ టచ్ ఇస్తూ రెహమాన్ చేసిన మ్యాజిక్ ఇది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతోంది.

ఒక్క పాటతోనే ఈ రేంజ్ రికార్డులు సృష్టిస్తే, ఇక సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఈ పాన్ ఇండియా సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అప్పటివరకు ఈ 'చికిరి చికిరి' మేనియా మాత్రం తగ్గేలా లేదని అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.