Begin typing your search above and press return to search.

పెద్ది 'చికిరి చికిరి'.. 8 నెలల పాటు కష్టపడ్డారా?

ఇప్పుడు బాలాజీ చికిరి చికిరి సాంగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

By:  M Prashanth   |   15 Nov 2025 2:00 AM IST
పెద్ది చికిరి చికిరి.. 8 నెలల పాటు కష్టపడ్డారా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందుతున్న ఆ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా.. ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ది.. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

అయితే సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి వచ్చిన విషయం తెలిసిందే. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఆ పాట.. అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. రామ్ చరణ్ మాస్ ఎనర్జీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. సాంగ్ ను భారీ స్థాయిలో తీర్చిదిద్దాయి. బాలాజీ అందించిన లిరిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ఇప్పుడు బాలాజీ చికిరి చికిరి సాంగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. తాను సాంగ్ కోసం లిరిక్స్ చాలా తక్కువ రోజుల్లోనే రాసినట్లు బాలాజీ తెలిపారు. కానీ పాట జర్నీ మొత్తం చూసుకుంటే.. ఎనిమిది నెలలకు పైగా సాగిందని ఆయన చెప్పుకొచ్చారు.

తాను ఇప్పటి వరకు 400 కంటే ఎక్కువ పాటలు రాశానని చెప్పిన బాలాజీ.. బుచ్చి బాబు ప్లాన్ చూసి ఆశ్చర్య పోయినట్లు చెప్పారు. స్మూత్ అండ్ రొమాంటిక్ వైబ్ వద్దని తనకు చెప్పినట్లు రివీల్ చేశారు. పెద్ది రఫ్‌ అండ్‌ రస్టిక్‌ నేచర్‌ ఉన్న వ్యక్తి కాబట్టి అలానే సాంగ్ ఉండాలని అన్నట్లు తెలిపారు. అందుకే పదాలు కూడా అలాంటివే వాడానని అన్నారు.

అయితే చికిరి చికిరి పాటను నాన్ తెలుగు సింగర్స్ మోహిత్ చౌహాన్, రఖీబ్ ఆలం ఆలపించారు. దీంతో తాను కూడా ఏఆర్ రెహమాన్ తో గంటన్నర పాటు స్డూడియోలో కూర్చున్నట్లు తెలిపారు. పదాలు సరిగ్గా ఉచ్చరించేందుకు సహాయం చేశానని పేర్కొన్నారు. చికిరి చికిరి రికార్డింగ్ సెషన్.. చిన్నపాటి మిషన్ లా మారిందని అన్నారు.

ఏదేమైనా బుచ్చిబాబు చాలా స్పెషల్ ప్లాన్ తో ఉన్నారని, అందుకే సాంగ్ లో చాలా మోడిఫికేషన్లు చేయించారని తెలిపారు. కొన్ని పదాలు తీస్తూ.. యాడ్ చేస్తూ.. అలా హీరో మనసులోంచి పదాలు నేరుగా వచ్చినట్లు అనిపించే వరకు వారు మార్పులు చేస్తూనే ఉన్నారని బాలాజీ చెప్పారు. అందుకే చాలా నెలల సమయం పట్టిందని అన్నారు. ఏదేమైనా సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుందని సంతోషం వ్యక్తం చేశారు.