పెద్ది బుచ్చి బాబు.. ఏదో చేసేలా ఉన్నాడే..!
ఆట కూలీగా ఉన్న చరణ్ అవసరమైన టైంలో ఆటగాడిగా ఎలా అదరగొడతాడు అన్నది పెద్ది కథ అని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 9 Oct 2025 3:00 PM ISTఉప్పెన చేసిన బుచ్చి బాబు పెద్ది సినిమా కోసం చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పెద్ది సినిమా విషయంలో ప్రతి విషయాన్ని బుచ్చి బాబు చాలా ఫోకస్ తో చేస్తున్నాడట. ప్రస్తుతం ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్ జరుతుంది. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు హీరో, హీరోయిన్ మధ్య ఒక సాంగ్ కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ కథ గురించి అంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
ఆట కూలీగా ఉన్న చరణ్..
ఆట కూలీగా ఉన్న చరణ్ అవసరమైన టైంలో ఆటగాడిగా ఎలా అదరగొడతాడు అన్నది పెద్ది కథ అని తెలుస్తుంది. ఐతే ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ తో మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చిన బుచ్చి బాబు నెక్స్ట్ మరో టీజర్ ని రెడీ చేయబోతున్నారట. బుచ్చి బాబు అయితే ఈ సినిమా విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలట్లేదని టాక్. పెద్ది బుచ్చి బాబు ప్లానింగ్ చూస్తుంటే ఇదేదో భారీగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉందనిపిస్తుంది.
సినిమాలో ఊరు నుంచి ఢిల్లీ వచ్చే సీన్స్ కూడా ఉంటాయట. తెర వెనుక బుచ్చి బాబు సీన్ రాయడం.. దానికి కెమెరా ముందు చరణ్ యాక్టింగ్ తో అదరగొట్టడం చేస్తుంటే.. రెహమాన్ తన మ్యూజిక్ తో ఆ సీన్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. పెద్ది ఫస్ట్ షాట్ తోనే సినిమా రేంజ్ ఇది అని అంచనాలు సెట్ చేసిన బుచ్చి బాబు నెక్స్ట్ రాబోతున్న ప్రమోషనల్ కంటెంట్ తో మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తాడని తెలుస్తుంది.
ఫెయిల్యూర్ ని మర్చిపోయే రేంజ్ లో..
గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ఆ ఫెయిల్యూర్ ని మర్చిపోయే రేంజ్ లో మరో సంచలనానికి చరణ్ సిద్ధమవుతున్నాడు. చరణ్ తో బుచ్చి బాబు చేసేది మొదటిసారే అయినా సుకుమార్ సినిమా టైంలో ఉన్న క్లోజ్ నెస్ తో పెద్ది ని పెద్ద ప్లానింగ్ తోనే తీసుకెళ్తున్నాడు బుచ్చి బాబు. సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. అనుకున్న డేట్ కి తీసుకొచ్చేలానే చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు.
పెద్ది సినిమా తర్వాత చరణ్ మళ్లీ సుకుమార్ తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ తోనే ఉంటుందని టాక్. పెద్ది సినిమా పూర్తయ్యే వరకు సుకుమార్ కూడా నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
