Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ పెద్ది.. తెలుగులో ర్యాంపేజ్ ఎలా ఉంది?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.

By:  M Prashanth   |   4 Jun 2026 11:41 PM IST
రామ్ చరణ్ పెద్ది.. తెలుగులో ర్యాంపేజ్ ఎలా ఉంది?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవెనింగ్ షో బుకింగ్స్ చూస్తే ప్రేక్షకులు సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో క్లియర్ గా కనిపిస్తోంది. విడుదల రోజే అనేక నగరాలు, పట్టణాల్లో షోలు సోల్డ్ అవుట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హైదరాబాద్‌ లో భారీ రేంజ్ లో షోలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో దాదాపు అన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ లేదా సోల్డ్ అవుట్ స్టేజ్ కు చేరాయి. మెట్రో సిటీలో ఆ రేంజ్ లో రెస్పాన్స్ రావడం సినిమాపై ఉన్న అంచనాలు, చరణ్ క్రేజ్‌ కు ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌ లో పరిస్థితి మరింత జోష్ తో కనిపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న అన్ని ఈవెనింగ్ షోలు దాదాపు నిండిపోయాయి.

కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, విజయనగరం, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ నగరాల్లో టికెట్లు దొరకడం కష్టంగా మారిందని తెలుస్తోంది. గుంటూరు, తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు వంటి సెంటర్స్ లోనూ పరిస్థితి దాదాపు అదే విధంగా ఉంది. చాలా షోలు ఇప్పటికే హౌస్‌ ఫుల్ కాగా, మిగిలినవి కూడా వేగంగా నిండుతున్నాయి. అనంతపురం, ఒంగోలు, కడప వంటి ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్నాయి.

తెలంగాణలో వరంగల్, ఖమ్మం, హనుమకొండ కేంద్రాల్లో ప్రేక్షకుల రెస్పాన్స్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మంలో అన్ని షోలు ఫుల్ అవ్వడం గమనార్హం. వరంగల్, హనుమకొండలో కూడా భారీ ఆక్యుపెన్సీ నమోదవుతోంది. కరీంనగర్‌ లోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. అయితే పెద్ది బుకింగ్ ట్రెండ్‌ లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. భారీ రెస్పాన్స్ కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాలేదు.

మదనపల్లె, తణుకు, భీమవరం వంటి టౌన్స్ లో కూడా షోలు సోల్డ్ అవుట్ కావడం సినిమాకు మాస్ ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూపిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు తొలి రోజు భారీ బుకింగ్స్ కనిపిస్తాయి. కానీ పెద్ది విషయంలో ఏ, బీ, సీ, డీ సెంటర్లలో కూడా ఒకే రేంజ్ జోష్ కనిపించడం విశేషం. తొలి రోజు సాయంత్రానికే ఈ స్థాయి ఆక్యుపెన్సీ నమోదవడం కలెక్షన్లపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

పాజిటివ్ టాక్ కొనసాగితే నైట్ షోలు, వీకెండ్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక సెంటర్స్ లో హౌస్‌ ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో పెద్దికి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ దక్కాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా విడుదల రోజే ఏపీ- తెలంగాణలోని ప్రధాన నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రేక్షకులు పెద్దికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈవెనింగ్ షోస్ బుకింగ్ ట్రెండ్ చూస్తుంటే రామ్ చరణ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకున్నట్లే.