కిల్లింగ్ లుక్స్ తో పాయల్ హొయలు!
ఇందులో గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె కిల్లింగ్ లుక్స్ తో అభిమానులను సైతం మెస్మరైజ్ చేసింది. తాజాగా పాయల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
By: Madhu Reddy | 27 Oct 2025 6:00 AM ISTపాయల్ రాజ్ పుత్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పంజాబీ ముద్దుగుమ్మ అయిన ఈమె డిసెంబర్ 5 1992న ఢిల్లీలో జన్మించింది.ఎక్కువగా తెలుగు పంజాబీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పాయల్ రాజ్ పుత్ తొలిసారి టీవీ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అలా 2010లో సప్నోన్ సే భరే నైనా అనే సీరియల్ ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత ఆఖిర్ బహు భీ తో భేటీ హై, మహా కుంభ్: ఏక్ రహస్య, ఏక్ కహానీ వంటి షోలలో కూడా కనిపించి సందడి చేసింది.
తొలిసారి 2017లో చన్నా మెరేయా పంజాబీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఉత్తమ తొలి నటిగా ఫిలింఫేర్ పంజాబీ అవార్డును దక్కించుకుంది. ఆ తర్వాత 2018లో వీరే కి వెడ్డింగ్ తో హిందీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2018లో ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఉత్తమ నటన కనబరిచి ఉత్తమ మహిళ డెబ్యూ విభాగంలో సైమా అవార్డును దక్కించుకుంది.
ఈ చిత్రాల తర్వాత తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు ఆర్డిఎక్స్ లవ్ , సీత, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిధి, తీస్ మార్ ఖాన్, గిన్నా, మాయా పేటిక వంటి చిత్రాలలో నటించిన ఈమె.. 2023లో వచ్చిన మంగళవారం సినిమాతో మరో సంచలనం సృష్టించింది. ఇందులో తొలిసారి డెవిల్ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. అటు విలన్ గానే కాకుండా ఇటు హారర్ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమాలు చేసి అందరిని అలరించింది.
అలా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇటు బుల్లితెరపై పలు సీరియల్స్ లో వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఇక అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను పంచుకుంది పాయల్ రాజ్ పుత్.. ఇందులో గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె కిల్లింగ్ లుక్స్ తో అభిమానులను సైతం మెస్మరైజ్ చేసింది. తాజాగా పాయల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పాయల్ సినిమాల విషయానికి వస్తే.. వెంకటలక్ష్మి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మొత్తం ఆరు భాషల్లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.. ప్రముఖ దర్శకుడు ముని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటివరకు సరైన అప్డేట్ లేదనే చెప్పాలి.
