Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన పాయల్‌

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌.

By:  Ramesh Palla   |   26 Aug 2025 11:04 AM IST
పిక్‌టాక్‌ : బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన పాయల్‌
X

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తక్కువ సమయంలోనే మంచి ఆఫర్లు దక్కించుకుంది. ఆర్‌ఎక్స్‌ 100లో ఈమె చేసిన నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు అని ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా ఆ సినిమాలో పాయల్‌ రాజ్‌పూత్‌ నేచురల్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత చాలా వరకు ఐటెం సాంగ్స్ లో కనిపించడంతో పాటు, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లోనూ నటించింది. ఈమెకు లక్ కలిసి రాకపోవడంతో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కలేదు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల ఆరబోత

ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ అమ్మడి అందం మరింత పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు అంటూ ఈమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారు చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ సినిమాలు చేయకున్నా కేవలం ఇన్‌స్టా ఫోటో షూట్స్ కారణంగా వార్తల్లో ఉంటుంది. ఈమె అందం బాలీవుడ్‌లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ కంటే ఉత్తమంగా ఉంటుంది అంటూ ఈమె అభిమానులు అంటూ ఉంటారు. బాలీవుడ్‌తో పాటు, సౌత్‌లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అందం ఈమెది అని, కానీ లక్ కలిసి రాకపోవడంతో చిన్న హీరోల సినిమాలకు, ఐటెం సాంగ్స్‌కు, స్పెషల్‌ క్యారెక్టర్స్‌ కి పరిమితం కావాల్సి వచ్చింది అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పాయల్‌ రాజ్‌పూత్‌ క్లీ వేజ్‌ షో

తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్‌ రాజ్‌ పూత్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోల కారణంగా వార్తల్లో నిలిచింది. బ్లాక్‌ డ్రెస్‌ సాధారణంగానే ముద్దుగుమ్మలు చాలా అందంగా ఉంటారు. ఈ అమ్మడి అందంను ఈ బ్లాక్ లాంగ్ ఫ్రాక్‌ మరింతగా పెంచింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న పాయల్‌ రాజ్ పూత్‌కి స్టార్‌ హీరోలకు జోడీగా ఎందుకు ఆఫర్‌ రాలేదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. లాంగ్‌ ఫ్రాక్ ధరించి టాప్‌ లో ఓపెన్‌గా ఉంచడంతో నెటిజన్స్‌ చూపు తిప్పడం కష్టంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్లీ వేజ్‌ షో చేస్తూ కవ్విస్తున్న ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు కూడా ఈమె ఇంతే అందంగా మరిన్ని సినిమాలు చేయాలి అంటూ ఈమె ఫాలోవర్స్‌తో పాటు అభిమానులు అంటున్నారు.


మంగళవారం సినిమాకు ప్రశంసలు

మొదటి సినిమా ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో చేసిన నెగిటివ్‌ పాత్రల తరహాలోనే కొన్ని సినిమాల్లో ఈమె నటించింది. ఆ మధ్య ఈమె చేసిన ఆర్‌డీఎక్స్ లవ్‌ సినిమాలతో పాటు మరికొన్ని బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచాయి. కానీ ఈమె చేసిన మంగళవారం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలోని పాయల్‌ పోషించిన పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఇలాంటి పాత్రలను చేసేందుకు ఎలాంటి హీరోయిన్‌ అయినా ముందుకు రాదు. ఆఫర్లు లేని సమయంలోనూ చాలా మంది ఇలాంటి పాత్రలకు వెనకాడుతారు. కానీ మంగళవారంలో పాయల్‌ పోషించిన పాత్ర ఆమెలోని నటిని బయటకు తీసింది. అంతే కాకుండా నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయాలని చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. అందుకే ఆమె నుంచి మరిన్ని ఆ తరహా పాత్రలు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.