విషాదం : ప్రముఖ హీరోయిన్‌కి పితృ వియోగం
నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్ రాజ్‌పూత్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పూత్ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న విమల్ కుమార్ రాజ్‌పూత్ ఇటీవల మృతి చెందారు.
By: Ramesh Palla | 30 July 2025 2:17 PM ISTఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన పాయల్ రాజ్‌పూత్ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. మొదటి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడంతో పాటు, అందాల ఆరబోత చేసి కుర్రకారు మనసు దోచుకుంది. అంతే కాకుండా నటనతో మెప్పించి ఫిల్మ్ మేకర్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్ రాజ్‌పూత్ తండ్రి విమల్ కుమార్ రాజ్‌పూత్ మృతి చెందారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న విమల్ కుమార్ రాజ్‌పూత్ ఇటీవల మృతి చెందారు. ఆ విషయాన్ని పాయల్ రాజ్‌పూత్ స్వయంగా వెళ్లడించింది. తన తండ్రిని కాపాడుకునేందుకు చాలానే ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదని పాయల్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన షేర్ చేసింది.
పాయల్ రాజ్‌పూత్ ఫ్యాన్స్ దిగ్బ్రాంతి
పాయల్ రాజ్‌పూత్ తండ్రి మరణ వార్త తెలియడంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ పాయల్ రాజ్‌పూత్ కి తమ సానుభూతి తెలియజేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పాయల్ రాజ్‌పూత్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం దారుణం అని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రేక్షకులను మెప్పిస్తూనే వస్తున్న పాయల్ రాజ్ పూత్ తిరిగి ఇండస్ట్రీలో పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి సినిమాలోనే మెచ్యూర్డ్‌గా నటించిన ఈ నటి ఎవరా అని చాలా మంది ఆర్‌ఎక్స్ 100 సినిమా విడుదల సమయంలో చర్చించుకున్నారు.
ఆర్‌ఎక్స్ 100 హీరోయిన్ తరహా పాత్రలు
ఆ సినిమా తర్వాత పాయల్ రాజ్‌పూత్‌కి వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. అయితే ప్రతిభ ఉన్న ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. ఈమె ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. పైగా ఈమెకు లేడీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్ అనే పేరు పడింది, అంతే కాకుండా ఈమెకు ఎక్కువగా ఆర్‌ఎక్స్ 100 సినిమాలోని హీరోయిన్ తరహా పాత్రలే వచ్చాయి. వచ్చిన ప్రతి ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని కెరీర్‌ను సాఫీగా ముందుకు తీసుకు వెళ్లేందుకు పాయల్ రాజ్‌పూత్ చాలానే ప్రయత్నాలు చేసింది. ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా ఏదో ఒక సినిమా చేస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. ఆర్‌ఎక్స్ 100 సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాయల్ సినిమాలు కంటిన్యూగా వస్తున్నాయి. అయితే వాటిల్లో ఎక్కువ శాతం నిరాశను కలిగించే సినిమాలు ఉన్నాయి.
మంగళవారం సినిమాతో ప్రశంసలు
కొన్ని సినిమాలు ఆమెను నటిగా గుర్తించే విధంగా ఉన్నప్పటికీ కమర్షియల్ విజయాలు సొంతం చేసుకోలేదు. ఈమె హీరోయిన్‌గా స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పటి వరకు పాయల్ రాజ్ పూత్‌కి యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాలేదు. ముఖ్యంగా ఈమె నటించిన మంగళవారం సినిమా నటనలో పది మెట్లు ఎక్కించింది. ఇలాంటి తరహా పాత్రలను చేసేందుకు ఒప్పుకోవాలి అంటే ఆ హీరోయిన్స్ కి ఘట్స్ ఉండాలి. పాయల్ రాజ్‌పూత్ ఆ పాత్రను చేసేందుకు కమిట్ కావడం చాలా పెద్ద విషయం అనే అభిప్రాయం వ్యక్తం అయింది. మంగళవారం సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అవి త్వరలోనే పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
