బ్లూ అవుట్ ఫిట్ లో పాయల్ హొయలు..
టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాలతో బలమైన ముద్ర వేసుకుంది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.
By: Madhu Reddy | 18 May 2026 10:31 AM ISTటాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాలతో బలమైన ముద్ర వేసుకుంది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నేవీ బ్లూ కలర్ హాల్టర్ నెక్ అవుట్‌ఫిట్‌లో పాయల్ అల్ట్రా స్టైలిష్‌గా మెరిసిపోయింది. "ఇన్‌హేల్ -ఎక్స్‌హేల్ " అంటూ షేర్ చేసిన ఈ ఫోటోషూట్‌లో ఆమె గ్లామర్, రాయల్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
బ్లూ డ్రెస్‌లో పాయల్ మాయ:
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒక సాఫ్ట్ బ్రౌన్ బ్యాక్‌డ్రాప్‌లో, డీప్ బ్లూ కలర్ స్లీవ్‌లెస్ హాల్టర్ నెక్ డ్రెస్ వేసుకుని పాయల్ ఇచ్చిన పోజులు అదిరిపోయాయి. దీనికి తోడు ఆమె వేసుకున్న షిమ్మర్ హీల్స్ ఈ లుక్‌కు మరింత రాయల్ టచ్ ఇచ్చాయి. ఇక స్టైలింగ్ నుండి మేకప్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కుదరడంతో పాయల్ ఇందులో చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తోంది.
క్యారెక్టర్ ఏదైనా పాయల్ వన్ మ్యాన్ షో:
పంజాబీ భామ అయినప్పటికీ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పాయల్. 'వెంకీ మామ', 'గిన్నా' వంటి కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పండించినా.. 'మంగళవారం' లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఇంటెన్స్ రోల్ చేసి అందరినీ మెప్పించింది. ఇక నటనకు స్కోప్ ఉన్న పాత్రలైనా, గ్లామర్ రోల్స్ అయినా నేను రెడీ అంటూ ఈ బ్యూటీ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను, సీరియస్ రోల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో పాయల్ రూటే వేరు.
ప్రస్తుతం పాయల్ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా పంజాబీలోనూ వరుస సినిమాలు చేస్తోంది. లీడర్, గోల్‌మాల్, కిరాతక, ది గ్రేట్ పంజాబ్ రాబరీ వంటి పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రస్తుతం ఆమె పైప్‌లైన్‌లో ఉన్నాయి.ఇక సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ, తనకంటూ క్రేజీ మార్కెట్ క్రియేట్ చేసుకుంటోంది. ఈ సినిమాలతో ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం అనిపిస్తోంది.
పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతుంది.అదే ముని దర్శకత్వంలో ఆమె 'వెంకటలక్ష్మి' అనే పవర్‌ఫుల్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఒక గిరిజన అమ్మాయి రివెంజ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఆమె మాట్లాడుతూ.. "డైరెక్టర్ ముని కథ చెప్పినప్పుడు నేను ఫిదా అయిపోయాను. ఈ సినిమా తర్వాత జనాలు నన్ను 'వెంకటలక్ష్మి'గా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు" అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది.ఇక సౌరభ్ ధింగ్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాయల్ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
