ఫోటో స్టోరి: నల్ల చీరలో పాయల్ హొయలు
సినీ పరిశ్రమలో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఎలా ఉండాలో..ప్రేక్షకుల దృష్టిని ఎలా ఆకర్షించాలో పాయల్ రాజ్‌పుత్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో!
By: Sivaji Kontham | 6 May 2026 11:57 AM ISTసినీ పరిశ్రమలో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఎలా ఉండాలో..ప్రేక్షకుల దృష్టిని ఎలా ఆకర్షించాలో పాయల్ రాజ్‌పుత్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో!. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. బ్లాక్ అండ్ గోల్డ్ లైనింగ్ శారీలో పాయల్ మెరిసిపోతున్న తీరు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. అందమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ యంగ్ బ్యూటీ ప్రదర్శించిన హొయలు కుర్రకారును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఎంపిక చేసిన బ్లాక్ శారీపై గోల్డ్ షైన్ పాయల్ లుక్ ని ఎలివేట్ చేసిందనే ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ డిజైనర్ శారీలో పంజాబీ సోయగం లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పాయల్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. తన మనసులోని భావాలను కూడా అంతే నిజాయితీగా ఓపెనవుతుంది. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తెలుగు మీడియా తన దివంగత తండ్రి గురించి అడిగిన ప్రశ్నకు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో కన్నీటి పర్యంతమై అక్కడి నుండి నిష్కృమించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పాయల్ ఎంత సెన్సిటివ్.. ఉద్వేగభరితమైన వ్యక్తి అనేదానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. అయితే తన వృత్తిగత కట్టుబాట్లకు ప్రాధాన్యతనిస్తూ పాయల్ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
టాలీవుడ్‌లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే పాయల్ తన స్వయంకృషితో అవకాశాలను అందుకుంటోంది. అవకాశాలు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో తనను తాను ఒక ఉత్తమ నటిగా మలుచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కెరీర్ విషయంలో ఎంతో ప్రయోగాత్మక ఆలోచనలతో ముందుకు సాగే పాయల్.... గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తోంది. ప్రస్తుతం పాయల్ ధరించిన చీర కట్టుపై ఇంటర్నెట్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇక పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం `గోల్‌మాల్` ..`కిరాతక` వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులలో భాగమైంది. `గోల్‌మాల్` చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇది ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే `కిరాతక` సినిమా కూడా తన కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని సమాచారం. ఈ రెండు సినిమాలు 2026 ద్వితీయార్థంలో లేదా ఏడాది చివరలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి పాయల్ రాజ్‌పుత్ తన జీవితంలోని కీలకమైన వ్యక్తిగత, వృత్తిగత వ్యవహారాలను బ్యాలెన్స్ చేస్తూ నటిగా నిరూపించుకునే దిశగా దూసుకుపోతోంది. ఓ పక్క తన తండ్రి జ్ఞాపకాలతో కూడిన ఉద్వేగం..మరోవైపు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ఫోటో షూట్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. విభిన్నమైన కథాంశాలతో రూపొందుతున్న తన తదుపరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.
